Asianet News TeluguAsianet News Telugu

అమర్ నాథ్ యాత్రలో పాక్ కుట్ర... భగ్నం చేసిన భారత ఆర్మీ

పాకిస్థాన్ ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రలో అలజడి సృష్టించాలని ప్రయత్నించారని చినార్ కార్స్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు. దీనికి సంబంధించి తమకు సమాచారం అందిందని.. వెంటనే సోదాలు నిర్వహించామని వారు చెప్పారు. 

Pak Army Landmine, Sniper Rifle Found In Amarnath Yatra Route: Army
Author
Hyderabad, First Published Aug 2, 2019, 3:59 PM IST

అమరనాథ్  యాత్రలో అలజడి సృష్టించేందుకు పాక్ కుట్ర పన్నినట్లు భారత ఆర్మీ వెల్లడించింది. అయితే.. పాక్ కుట్రను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీనికి సంబంధించిన పక్కా ఇంటిలిజెన్స్ సమాచారం అందడంతో ముందుగానే సోదాలు చేపట్టిట...వారి కుట్రను భగ్నం చేసినట్లు వారు పేర్కొన్నారు.

ఈ మేరకు భారత ఆర్మీ, పోలీసులు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ వివరాలను వెల్లడించారు. జమ్ముకశ్మీర్ లో భారీగా భద్రతా దళాలు మోహరించడం తో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో మీడియా సమావేశం నిర్వహించిన ఈ వివరాలను వెల్లడించారు.

పాకిస్థాన్ ఉగ్రవాదులు అమరనాథ్ యాత్రలో అలజడి సృష్టించాలని ప్రయత్నించారని చినార్ కార్స్ప్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ దిల్లాన్ తెలిపారు. దీనికి సంబంధించి తమకు సమాచారం అందిందని.. వెంటనే సోదాలు నిర్వహించామని వారు చెప్పారు. ఈ కుట్రకు పాకిస్తాన్ ఆర్మీకి ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని వారు పేర్కొన్నారు.

పాకిస్థాన్‌ ఆయుధ కర్మాగారంలో తయారైన మైన్లు లభించడం ఇందుకు సాక్ష్యమన్నారు. అమర్‌నాథ్‌ యాత్ర మార్గంలో అమెరికా ఎం-24 స్నిపర్‌ సహా పలు రైఫిళ్లు, ఈ మార్కు ఉన్న పలు మైన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని స్పష్టంచేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios