కాఫీ కింగ్ సిద్ధార్థ మృతి...విస్తుపోయే విషయాలు వెలుగులోకి

By telugu teamFirst Published Aug 2, 2019, 4:39 PM IST
Highlights

కేఫ్ కాఫీడే గ్రూపుకి చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు కొందరు బోగస్ పత్రాలు సమర్పించి తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.145కోట్ల మేర అడ్డదారిలో రుణాలు పొందినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా గుర్తించారు.

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా... ఆయన ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా పలు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. కేఫ్ కాఫీడే గ్రూపుకి చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులు కొందరు బోగస్ పత్రాలు సమర్పించి తమిళనాడు కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేటు బ్యాంకులో రూ.145కోట్ల మేర అడ్డదారిలో రుణాలు పొందినట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు తాజాగా గుర్తించారు.

సిద్ధార్థ మృతి అనంతరం కేఫ్ కాఫీడేకి చెందిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ అధికారులు విచరాణ మొదలుపెట్టారు. కాగా.. ఈ క్రమంలో అధికారలకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కేఫ్ కాఫీడేకి చెందిన కొందరు ఉద్యోగులు, ఉన్నతాధికారులు... రైతుల పేరిట నకిలీ పత్రాలు సమర్పించి కోట్ల రూపాయల రుణాలు పొందినట్లు ఐటీశాఖ అధికారులు గుర్తించారు.

అంతేకాదు.. అలా పొందిన రుణాలను సిద్ధార్థకు చెందిన ఇతర కంపెనీలకు అక్రమంగా తరలించినట్లు గుర్తించారు. సిద్ధార్థ మరణానంతరం కేఫ్ కాఫీడే బోర్డులో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఓ ఉన్నతాధికారి సైతం ఇదే విధంగా రుణం పొందినట్లు తేలడం గమనార్హం.

కర్ణాటకలోని చిక్ మంగళూర్ లో కాఫీ సాగు చేస్తున్న రైతులుగా పేర్కొంటూ కేఫ్ కాఫీ డే గ్రూపు  అందించినట్లుగా నకిలీ విక్రయ హామీ పత్రాలను బ్యాంకులో సమర్పించారు. కేఫ్ కాఫీడే గ్రూపు అందించినట్లు ఉండటంతో బ్యాంకు వర్గాలు ఏ మాత్రం ఆలోచించకుండా రుణాలు ఇచ్చేశాయి. ఆ నగదుని వేరే మార్గాల ద్వారా ఇతర కంపెనీలుకు ట్రాన్స్ఫర్ చేసినట్లు ఐటీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 

click me!