విజయవాడ ఎంపీ కేశినేని నాని... మరోసారి సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోయారు. గత కొంతకాలంగా... కేశినేని, వైసీపీ నేత పీవీల మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ నేపథ్యంలో... పీవీపీ పేరు ఎత్తకుండానే... అతనిని ఉద్దేశిస్తూ... జగన్ కి కేశినేని ఓ పోస్టు పెట్టారు.

జగన్‌ పేరును ప్రస్తావిస్తూ.. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చుటోపి పెట్టాడని.. వేలాది కోట్లను తిరిగి చెల్లించిన అనంతరం శ్రీరంగ నీతులు చెప్పమనండంటూ నాని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘‘అయ్యా జగన్ రెడ్డి గారు బ్యాంకుల పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి బాగోలేదు. మీ సహచరుడు బ్యాంకులకు కుచ్చు టోపీ పెట్టిన.. వేలాది కోట్లను తిరిగి చెల్లించిన తర్వాత శ్రీరంగ నీతులు చెప్పమనండి. లేకపోతే నిమ్మగడ్డకు పట్టిన గతే పడుతుంది’’ అని ఎంపీ కేశినేని నాని ట్వీట్ చేశారు.

ఇదిలా ఉంటే కేశినేని పెట్టిన ప్రతి పోస్టుకి పీవీపీ ఏదో ఒక రకంగా స్పందిస్తూనే ఉంటారు. కేశినేని పేరు ఎత్తకుండా వ్యగ్యంగా పద్యాలు, గేయాలతో పోలుస్తూ ట్వీట్లు చేస్తుంటారు. మరి ఈ సారి తనపై చేసిన పోస్టుకి పీవీపీ ఎలా స్పందిస్తారో చూడాలి.