Asianet News TeluguAsianet News Telugu

కేంద్రం మెడలు వంచుతానన్న జగన్ ఇప్పుడు మెడ ఎత్తడేం: మాజీమంత్రి శైలజానాథ్ ఫైర్

వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చట్టం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని శైలజానాథ్ విమర్శించారు
 
ex minister, congress senior leader sailajanath comments on ysrcp, bjp
Author
Srikakulam, First Published Aug 2, 2019, 2:33 PM IST

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయ్ జగన్మోహన్ రెడ్డిపై మాజీమంత్రి సాకే శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైయస్ జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటలను అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టించుకోవడం లేదని విమర్శించారు. 

నాడు కేంద్రం మెడలు వంచుతానని చెప్పిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రం వద్ద మెడలు ఎత్తడం లేదని తీవ్రంగా ఆరోపించారు. శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన ఆయన కేంద్రంలోని బీజేపీ చేస్తున్న ఆగడాలను వైసీపీ ఖండించలేకపోతుందని విమర్శించారు. 

వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రప్రయోజనాలను కాపాడటంలో జగన్ ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ట్రిపుల్ తలాక్ చట్టం విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి ప్రదర్శించిందని శైలజానాథ్ విమర్శించారు

మరోవైపు బీజేపీపైనా శైలజానాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనలో ఏ వర్గాల ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దేశంలోని సెక్యూలర్ వ్యవస్థను ధ్వంసం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. బీజేపీ పాలకులపై ప్రజలు పోరాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఆగడాలను ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని చెప్పుకొచ్చారు మాజీమంత్రి శైలజానాథ్.  

Follow Us:
Download App:
  • android
  • ios