మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా చిత్రంతో బిజీగా ఉన్నారు. చిరుకి దైవ భక్తి కూడా ఎక్కువే. ముఖ్యంగా ఆంజనేయ స్వామి అంటే చిరు ఎక్కువ భక్తిని ప్రదర్శిస్తుంటారు. తాజాగా మెగాస్టార్ నివాసానికి కొత్త వెండి మండపం చేరింది. దీనిని చిరంజీవి పూజా కార్యక్రమాల కోసం ప్రత్యేకంగా చేయించుకున్నారు. 

ఆదోనికి చెందిన రంగన్నచారి సన్స్ అండ్ మెటల్ వర్క్స్ లో చిరంజీవి దీనిని తయారు చేయించుకున్నారు. గత కొన్ని రోజులుగా ఈ వెండి మండపం పనిలో నిమగ్నమైన వారు ఎట్టకేలకు పూర్తి చేసి చిరంజీవికి అప్పగించారు. చిరు వెండి మడపంతో కలసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

ఇదిలా ఉండగా చిరంజీవి నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. రాంచరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, తమన్నా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.