నిన్న బిగ్ బాస్ షోలో పవర్ గేమ్ టాస్క్ లో పెద్ద రచ్చ జరిగింది. టాస్క్ లో భాగంగా బజర్ మోగిన వెంటనే ఎవరైతే డైమండ్ చేజిక్కించుకుంటారోవారికి ఇంటిపై పెత్తనం చేసే అధికారం వస్తుంది.. మళ్లీ బజర్ మోగే వరకు ఆ హౌస్ మేట్ చెప్పినట్లే మిగిలిన ఇంటి సభ్యులు వినాల్సివుంటుంది. మొదటి ఛాన్స్ లో వరుణ్ తేజ్ డైమండ్ పట్టుకొని కింగ్ లా మారిపోయారు. తన మంత్రిగా బాబా భాస్కర్ ని ఎన్నుకున్నాడు.

తన బట్టలను ఉతకవలసిందిగా హిమజను.. బెడ్‌రూంను సరిగా సర్దమని శ్రీముఖి, మహేష్‌లను.. నాగిని డ్యాన్స్‌ వేయాలని తమన్నాను.. ఆమెకు సహాయం చేయాల్సిందిగా బాబా భాస్కర్‌ను ఆదేశించాడు. రెండో బజర్ మోగిన వెంటనే పరిగెత్తిన అలీ రెజా.. డైమండ్ ని అందుకునే క్రమంలో శివజ్యోతిని పక్కకి నెట్టేశాడు. ఆ తరువాత ఆమెని పైకిలేపి డైమండ్ తీసుకోమని చెప్పాడు.

ఆటలో ఇవన్నీ కామన్ అంటూ ఆమె అలీ రెజాకి కిరీటం తొడిగింది. అలా కింగ్ అయిన అలీ మగవారందరినీ ఆడవారిగా రెడీ కావాలని ఆదేశించాడు. దీంతో జాఫర్, వరుణ్, వితికా, తమన్నాలు టాస్క్ చేయలేమని చెప్పేశారు. మిగిలివారంతా అలీని ఎంటర్టైన్ చేశారు. ఇలా జరుగుతుండగా.. అలీ రెజాపై తమన్నా ఫైర్ అయింది. బాడీ ఉన్నంతమాత్రానా సూపర్ స్టార్ కాలేరని అలీరెజాని ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. 

తనను సూపర్ స్టార్ కాకుండా అడ్డుకుంటానని పేర్కొంది. ఇక అషూ రెడ్డిపై కూడా విరుచుకుపడింది. అషూ.. అలీ పక్కన సన్నిహితంగా కూర్చోవడంతో.. 'సిగ్గు, శరం లేకుండా ఎంత బాగా కూర్చున్నావంటూ' ఘాటు వ్యాఖ్యలు చేసింది. దీంతో హౌస్ మేట్స్ అందరూ తమన్నా తీరుని తప్పుబట్టారు.