ప్రముఖ టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున 'బిగ్ బాస్' షోకి హోస్ట్ గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ షో కి కంటెస్టంట్స్ ని ఎంపిక చేసే ప్రాసెస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతారెడ్డి ఆరోపణలు చేస్తోన్న సంగతి తెలిసిందే.

అయితే ఈ వివాదానికి సంబంధించిన తాజాగా ఓ ప్రెస్ మీట్ నిర్వహించిన ఆమె నాగార్జునని టార్గెట్ చేస్తూ బూతులు తిట్టింది. నాగార్జునకు సామాజిక బాధత్య లేదా..? అంటూ ప్రశ్నించింది. అమల జంతువుల కోసం స్పందిస్తున్నప్పుడు ఇంతమంది అమ్మాయిల ఆరోపణలపై ఎందుకు స్పందించరని అని అడిగింది. టాస్క్ ల పేరుతో కంటెస్టంట్ లను మానసికంగా హింసిస్తున్నారని.. దమ్ముంటే అమలను, సమంతను బిగ్ బాస్ షోకి పంపించండి అంటూ సవాల్ విసిరింది.

'మన్మథుడు 2' సినిమా ప్రమోషన్స్ పై చూపిస్తున్న ఆసక్తి నాగార్జున మా ఆరోపణలపై ఎందుకు స్పందించడం లేదని ఫైర్ అయింది. నాగార్జున తమ ఉద్యమాన్ని నీటి బుడగ అంటున్నారని.. ఓయూ విద్యార్ధులకు నాగార్జున ఓ గాలి బుడగ అని కామెంట్స్ చేసింది శ్వేతారెడ్డి. నాగార్జున ఒక రోజు మీ భార్య అమలను, కోడలు సమంతను బిగ్ బాస్ 
హౌస్ లో ఉంచి డబ్బులు సంపాదించండి అంటూ మండిపడింది.

తప్పు చేయకపోతే బయటకొచ్చి స్పందించాలని.. నాగార్జున దొంగలా ఎందుకు దాక్కుంటున్నారని ప్రశించింది. హౌస్ లో అందరినీ జంతువులుగా బంధించి హింసిస్తున్నారని.. నాగార్జునపై మండిపడుతూ బూతులు తిట్టింది. మరి ఈ వివాదంపై నాగార్జున కానీ, బిగ్ బాస్ నిర్వాహకులు కానీ స్పందిస్తారేమో చూడాలి!