సినీ నటుడు రాజశేఖర్ పై సోషల్ మీడియాలో ఓ మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రాఫిక్ రూల్స్ విషయంలో సామాన్యుల పట్ల ఒకలా, సెలబ్రిటీల విషయంలో మరోలా పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. హీరో రాజశేఖర్ ట్రాఫిక్ నిబంధనలు ఉల్లఘించినందుకుగాను రూ. 18 వేల వరకు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు ఓ ఆంగ్ల పత్రికలో వార్తలు వచ్చాయి. 

ఆ వార్త గురించి ప్రస్తావిస్తూ ఓ మహిళ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. చలానాలు పెండింగ్ లో ఉన్నా రాజశేఖర్ ఫ్రీగా హైదరాబాద్ లో తిరుగుతున్నారు.. పోలీసులు ఏం చేయలేరా అని ప్రశ్నించింది. దీని రాజశేఖర్ సమాధానం ఇచ్చారు. డోంట్ వర్రీ.. చలానాలు కట్టేశా. భవిష్యత్తులో నా చలానాలు పెండింగ్ లో ఉండవు. 

తప్పు చేసిన వారు ఎవరైనా ఫ్రీగా తిరగలేరు. పోలీసులు స్పందించలేదు అంటే దానికి కారణం వారితో నేను చర్చలు జరుపుతున్నాను అని రాజశేఖర్ వెల్లడించారు. సినిమాల విషయాన్ని వస్తే రాజశేఖర్ నటించిన కల్కి చిత్రం ఇటీవల విడుదలై పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో రాజశేఖర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు.