Asianet News TeluguAsianet News Telugu

సీఎం జగన్ సంచలన నిర్ణయం: ఒకరికి కేబినెట్, ఆరుగురికి సహాయమంత్రుల హోదా

అసెంబ్లీలో ప్రభుత్వ విప్ లుగా నియమితులైన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాలకు సహాయ మంత్రి హోదా కల్పించారు. 
 
Ap cm ys jagan sensational decision over his cabinet
Author
Amaravathi, First Published Aug 2, 2019, 3:23 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైయస్ జగన్ కేబినెట్ లో మరొకరికి కేబినెట్ హోదా, ఆరుగురికి సహయమంత్రుల హోదా కల్పించారు. 

ఏపీ అసెంబ్లీ ప్రభుత్వ చీఫ్ విప్ గా పనిచేస్తున్న రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్వర్వులు జారీ చేసింది. అలాగే ఆరుగురు ప్రభుత్వ విప్ లకు సహాయమంత్రులుగా అవకాశం కల్పించారు. 

అసెంబ్లీలో ప్రభుత్వ విప్ లుగా నియమితులైన ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సామినేని ఉదయభాను, కాపు రామచంద్రారెడ్డి, కోరుముట్ల శ్రీనివాసులు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజాలకు సహాయ మంత్రి హోదా కల్పించారు. 

మెుత్తం జగన్ కేబినెట్ లో ఒకరికి కేబినెట్ మరో ఆరుగురికి సహాయ మంత్రులు హోదా కల్పిస్తూ సీఎం జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జీఏడీ కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. 
 
Follow Us:
Download App:
  • android
  • ios