ఆర్ ఎక్స్ 100 లాంటి యువతకు నచ్చే ఎమోషనల్ లవ్ స్టోరీతో హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు కార్తికేయ. ఆ చిత్రంలో కార్తికేయ నటనకు బావుండడంతో అతడికి మంచి ఇమేజ్ ఏర్పడింది. నటుడిగా తన స్థాయిని, హీరోగా మార్కెట్ ని పెంచుకునే ప్రయత్నాల్లో ఈ యువ హీరో ఉన్నాడు. కార్తికేయ నటించిన తాజా చిత్రం గుణ 369 శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

కార్తికేయ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో కార్తికేయ మెగాస్టార్ చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నటుడిగా మీ టార్గెట్ ఏంటి అని మీడియా ప్రశ్నించగా కార్తికేయ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. నా ప్రతి చిత్రంతోను నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నా. 

నటుడిగా ఎదిగేందుకు ఆకాశమే హద్దు అని భావిస్తే నా దృష్టిలో మెగాస్టార్ చిరంజీవి ఆకాశం. అక్కడినే చేరుకోవడమే తన టార్గెట్ అని కార్తికేయ తెలిపాడు. మెగాస్టార్ స్థాయికి చేరుకోవడం ఏమో కానీ ఇటీవల వచ్చిన విజయ్ దేవరకొండ లాంటి హీరోలు విభిన్నమైన నటనతో యువతలో మంచి క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు. ఆ దిశగా ప్రయత్నిస్తే కార్తికేయ కూడా స్టార్ హీరో కావచ్చు.