రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు అయిన దేవదాస్ కనకాల(74) మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న ఆయన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మరణించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దేవదాస్ కనకాల పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. 

దర్శకుడిగా కూడా దేవదాస్ కనకాల గుర్తింపు పొందారు. 1945 జులై 30న యానాంలో దేవదాస్ కనకాల జన్మించారు. దేవదాస్ కనకాలకు ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. ఆయన కుమార్తె పేరు శ్రీ లక్ష్మి. కుమారుడు రాజీవ్ కనకాల నటుడిగా టాలీవుడ్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. 

చలిచీమల, నాగమల్లి చిత్రాలకు రాజీవ్ కనకాల దర్శత్వం వహించారు. నటుడిగా కొనసాగుతూనే హైదరాబాద్ లో ఆయన యాక్టింగ్ స్కూల్ నడిపించారు. దేవదాస్ కనకాల ఓ సీత కథ, చెట్టుకింద ప్లీడర్, గ్యాంగ్ లీడర్, అమ్మో ఒకటో తారీకు, మనసంతా నువ్వే, కింగ్, జోష్, భరత్ అనే నేను చిత్రాల్లో నటించారు. 

దేవదాస్ కనకాల మృతితో సినీ ప్రముఖులలో విషాదం నెలకొంది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నారు.