శంషాబాద్‌ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో శుక్రవారం కిడ్నాప్ కలకలం రేపింది. ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన కుటుంబం నగరంలోని ఓ ప్రాంతానికి వెళ్లేందుకు రెండు క్యాబ్‌లు బుక్ చేసుకుంది.

పిల్లలు ఒక క్యాబ్‌లో, తల్లిదండ్రులు మిగిలిన కుటుంబసభ్యులు మరో క్యాబ్ ఎక్కారు. అయితే పిల్లలను ఎక్కించుకున్న క్యాబ్ డ్రైవర్ పరారయ్యేందుకు ప్రయత్నించాడు.

దీంతో మరో కారులో ఆ కారును వెంబడించిన తల్లీదండ్రులు డ్రైవర్‌ను పట్టుకున్నారు. అనంతరం శంషాబాద్ పీఎస్‌లో డ్రైవర్‌ను అప్పగించి ఫిర్యాదు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.