ప్రకాశం: ప్రకాశం జిల్లా సింగరాయకొండలో దారునం చోటు చేసుకుంది. ఓ యువతిని వేధించారని ఆరోపిస్తూ ముగ్గురు యువకులను చితకబాదారు యువతి తరపు బంధువులు. తమ బంధువుల అమ్మాయిని వేధించారని ఆరుగురు యువకులు ముగ్గురు యువకులను జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి చితకబాదారు.  

తాము యువతిని వేధించలేదని తాము ఏ తప్పు చేయలేదని వారు వాదించినా వినలేదు. తమను కొట్టొద్దంటూ వేడుకున్నారు. ఆఖరికి కాళ్లు కూడా పట్టుకుంటూ బతిమిలాడారు. అయినా వినకుండా కర్రలతో చితక్కొట్టారు. 

తమ స్నేహితులు ముగ్గురు యువకులను చితక్కొడుతుంటే మరో యువకుడు ఈ తతంగాన్ని వీడియోలో చిత్రీకరిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందారు.  తాము ఏ తప్పూ చేయలేదని, తమను కొట్టొద్దని బాధితులు వేడుకున్నారు. అయినా వినకుండా కర్రలతో చితకబాదారు. 

అంతే కాకుండా ఈ తతంగం మెుత్తాన్ని అమీర్ అనే యువకుడు వీడియో తీశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.  సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. 

ముగ్గురు యువకులపై అరాచకం చేసిన ఆరుగురు ఆకతాయిలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ముగ్గురు బాధితులు శివ, రియాజ్, బ్రహ్మంగా పోలీసుల విచారణలో తేలింది. అయితే ఈ దాడికి పండు శివానీ అనే యువకుడు కీలక సూత్రధారి అని పోలీసులు గుర్తించారు.