అంబటి రాయుడిపై 3డి ఎఫెక్ట్

By rajesh yFirst Published Jul 2, 2019, 6:27 PM IST
Highlights

నేటి ముఖ్యమైన వార్తలను మీరు మిస్సయ్యారా... అలా మిస్ కాకూడదంటే ఈ కింది వార్తలను సంక్షిప్తంగానే కాకుండా వివరంగా కూడా చదవడానికి వీలుగా అందిస్తున్నాం.

జాగ్రత్త !చెప్పకుండా వస్తా: అధికారులతో జగన్

స్పందన కార్యక్రమం ఎలా అమలు జరుగుతోందనే విషయమై తాను ఆకస్మిక తనిణీలు నిర్వహించి పరిశీలిస్తానని ఏపీ సీఎం వైఎస్ జగన్ చెప్పారు. స్పందన కార్యక్రమంపై ఏపీ సీఎం వైఎస్ జగన్  మంగళవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆయా జిల్లాల కలెక్టర్లు,. ఎస్పీలతో ఆయన  టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
 

 

చంద్రబాబూ! శ్రీరంగనీతులు ఆపు, మా జోలికి వస్తే తాట తీస్తాం : వైసీపీ ఎమ్మెల్యే కాసు వార్నింగ్

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తామని టీడీపీ నేతలకు వార్నింగ్ ఇచ్చారు ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి. ఎన్నికల అనంతరం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ భౌతిక దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు. 
 

 

ఏపీలో అధికారం టీడీపీదా? వైసీపీదా? లోకేష్ కౌంటర్

ఆంధ్రప్రదేశ్ లో అధికారం వెలగపెడుతోంది టీడీపీ నా? వైసీపీ నా అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వంపై లోకేష్ ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు.

 

డియర్ కామ్రేడ్: రొమాన్స్ డోస్ ఎక్కువే..?

టాక్సీవాలా సక్సెస్ అనంతరం విజయ్ దేవరకొండ నుంచి వస్తోన్న మరో డిఫరెంట్ మూవీ డియర్ కామ్రేడ్. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి సారి విజయ్ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 


 

రాష్ట్రాన్ని చెదపురుగుల్లా తినేసి సుమతీ శతకాలా, కాస్త ఓపికపట్టు: చంద్రబాబుపై విజయసాయి ఫైర్

మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి. తెలుగుదేశం పార్టీ పాలనలో చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుతిన్నారని ఆరోపించారు.  
 

 

నేనిక్కడ పుట్టకపోయినా....: కుప్పం ప్రజలతో చంద్రబాబు

తాను ఈ ప్రాంతంలో పుట్టకపోయినా.... తనను గుండెల్లో పెట్టుకొన్న కుప్పం నియోజకవర్గ  ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు చెప్పారు.మంగళశారం నాడు కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పంలో  టీడీపీ చీఫ్  చంద్రబాబునాయుడు పర్యటించారు.ఈ సందర్భంగా  ఆయన  మాట్లాడారు.
 

 

జగన్ కి కొంత సమయం ఇవ్వాలి...గల్లా అరుణ

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతుందని తాను ఊహించలేకపోయానని ఆ పార్టీ మహిళా నేత గల్లా అరుణ కుమారి అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరపరాజయం చవి చూడగా... వైసీసీ అనూహ్య మెజార్టీతో విజయం సాధించింది. కాగా... ఈ ఘటనపై తొలిసారి గల్లా అరుణ స్పందించారు.
 

 

చిత్తూరులో బాబుకు షాక్: బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే

చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే హేమలత బీజేపీలో చేరారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సత్యవేడు నుంచి గెలిచిన హేమలత 2014, 2019 ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.
 

ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

గతంలో కూడ తనను రెండు మూడు దఫాలు ఎమ్మెల్యే వర్గీయులు బెదిరింపులకు పాల్పడ్డారని ఎఫ్ఆర్ఓ అనిత  ఆరోపించారు. తన మాట వినని అధికారులను ఎమ్మెల్యే  బదిలీ చేయించారని ఆమె గుర్తు చేశారు.

 

ఎమ్మెల్యే కోనప్పపై ఎఫ్ఆర్ఓ అనిత సంచలన వ్యాఖ్యలు

గతంలో కూడ తనను రెండు మూడు దఫాలు ఎమ్మెల్యే వర్గీయులు బెదిరింపులకు పాల్పడ్డారని ఎఫ్ఆర్ఓ అనిత  ఆరోపించారు. తన మాట వినని అధికారులను ఎమ్మెల్యే  బదిలీ చేయించారని ఆమె గుర్తు చేశారు.
 

 

సార్సాలో ఉద్రిక్తత: అటవీశాఖాధికారులను అడ్డుకొనేందుకు గ్రామస్తుల యత్నం

కాగజ్‌నగర్ మండలం సార్సాలో  మంగళవారం నాడు మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది. తాము సాగు చేస్తున్న భూముల్లో  మొక్కలు నాటేందుకు అడ్డుకోవడాన్ని స్థానిక రైతులు అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మరోసారి ఉద్రిక్తత చోటు చేసుకొంది. గ్రామంలోకి ఇతరులను పోలీసులు అనుమతించడం లేదు.
 

మంచు లక్ష్మీపై నెటిజన్ల ట్రోల్స్.. శ్రీరెడ్డి పంచ్!

తాజాగా నటి మంచు లక్ష్మి కూడా సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లింది. సమంత ప్రధాన పాత్రలో నటించిన 'ఓ బేబీ' సినిమా జూలై 5న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ వేడుకకు వెంకటేష్, రానా లతో పాటు మంచు లక్ష్మీ కూడా హాజరైంది.

 

అటవీ అధికారులపై దాడి: ఆడియో లీక్, చిక్కుల్లో ఎమ్మెల్యే వనమా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ పారెస్ట్ ఆఫీసర్‌కు  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫోన్ చేసిన ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్‌కు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫోన్ చేసినట్టుగా ఆడియోలో ఉంది. 
 

 

బూటు కాలితో తన్నింది, అందుకే దాడి: అనితపై ఎమ్మెల్యే కోనప్ప

సార్సాలో  ఎఫ్ఆర్ఓ అనిత ఓ మహిళను దారుణంగా  బూటు కాలితో తన్నిందని, ఈ కోపంతోనే ఆమె భర్తే ఎఫ్ఆర్ఓ అనితపై  దాడి చేశారని  సిర్పూర్ కాగజ్‌నగర్ ‌ ఎమ్మెల్యే  కోనేరు కోనప్ప చెప్పారు.
 

 

తెలంగాణ కాంగ్రెసుకు షాక్: బిజెపిలోకి మర్రి శశిధర్ రెడ్డి, పద్మిని?

తెలంగాణలో కాంగ్రెసు పార్టీని ఖాళీ చేసి తాను బలపడాలనే వ్యూహాన్ని బిజెపి అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలువురు కాంగ్రెసు నాయకులకు గాలం వేస్తోంది. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బిజెపిలో చేరేందుకు సిద్ధపడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
 

 

సీఎం జగన్ వస్తున్నాడని మహేష్ బాబుకు తెలియదా!

సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. అయినా కూడా ఏదో ఒక వివాదం సెలబ్రిటీలని వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవల కృష్ణ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణ సతీమణి విజయనిర్మల మరణించిన సంగతి తెలిసిందే. దీనితో కృష్ణని పరామర్శించడానికి సినీ రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. 

 

కుల వివాదం.. మెగాహీరో సినిమా షూటింగ్ కి బ్రేకులు!

మెగాహీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'వాల్మీకి'. అయితే ఈ సినిమా టైటిల్ మార్చమని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అది సర్దుకోవడంతో షూటింగ్ మొదలుపెట్టి కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేశారు.
 

 

విజయ్ దేవరకొండ హీరోయిన్ తో బాలీవుడ్ హీరో ఎఫైర్!

సినిమా ఇండస్ట్రీలో డేటింగ్ వ్యవహారాలు చాలా కామన్.. తాజాగా ఓ హీరో డేటింగ్ విషయం బయటపడింది. 'యూరి' సినిమాతో హీరోగా పాపులారిటీ దక్కించుకున్న విక్కీ కౌశల్.. నటి మాళవిక మోహనన్ తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోంది.
 


అన్ని చెడగొట్టే సినిమాలే.. నేటితరంపై లవకుశల అసహనం

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత సినిమాలపై అలనాటి లవకుశలు అసహనం వ్యక్తం చేశారు. భారతీయ నాగరికతను నేటి సినిమాలు చాలా దెబ్బ తీస్తున్నాయని ముఖ్యంగా హీరోయిన్స్ అంగాంగ ప్రదర్శన యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ యువతను మార్చివేస్తునట్లు చెబుతూ.. అందరికి స్ఫూర్తినిచ్చేలా సినిమాలు రావడం లేదని అన్నారు. 
 

 

దర్శకుడి బర్త్ డే వేడుకల్లో చిరు, బాలయ్య!

ఒకప్పటి స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు కలిసి ఓ వేడుకలో సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. సోమవారం రాత్రి గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు.
 

 

శ్రీముఖి టీషర్ట్ పైకి లేపి మరీ..!

బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది శ్రీముఖి. తన బోల్డ్ కామెంట్స్ తో టీవీ షోలలో రచ్చ చేసే ఈ బ్యూటీ ఇప్పుడుసినిమాల్లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.
 

 

బంగార్రాజును కూడా లాగేస్తోంది..?

టాలీవుడ్ లో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రత డోస్ పెరుగుతోంది. కాళ్ల దగ్గరకొచ్చిన అవకాశాలను మరో హీరోయిన్స్ తన్నుకుపోతున్నారు. ఆ లిస్ట్ లో పూజా హెగ్డే రెచ్చిపోతోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా అమ్మడు ఈ మధ్య నాన్ స్టాప్ గా అవకాశాలను అందుకుంటోంది.
 


సాయి పల్లవి పిక్ లీక్.. విరాటపర్వంలో ఇలా!

సాయి పల్లవి, రానా ఇద్దరిలో ఓ పోలిక ఉంది.. తాము నటించిన చిత్రాల్లో వైవిధ్యం ఉండాలని, నటనకు ప్రాధ్యానత ఉండాలని ఉండాలని ఇద్దరూ కోరుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో 1992 బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 
 

 

వరల్డ్ కప్ నుంచి విజయ శంకర్ ఔట్... అభిమానుల్లో అనుమానాలు

టీం ఇండియా క్రికెటర్ విజయ శంకర్ వరల్డ్ కప్ నుంచి దూరమైన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు విజయ శంకర్ నుంచి వరల్డ్ కప్ గాయం వల్ల కాకుండా.. కావాలనే పంపించారనే వాదనలు వినపడుతున్నాయి
 

 

ఇంగ్లాండుపై ఓడి పాక్ ను ఇండియా చిత్తు చేసింది: ఆనంద్ మహీంద్ర

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో భారత్ ఓటమిపై మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండుపై భారత్ ఓటమి తర్వాత ఆయన పాకిస్తాన్ జట్టును ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు
 

 

శంకర్ ప్లేస్‌లో మయాంక్: రాయుడి కొంపముంచిన 3డీ, వదలని ఎమ్మెస్కే

అంబటి రాయుడును మరోసారి దురదృష్టం వెంటాడింది. గాయం కారణంగా విజయ్ శంకర్ తప్పుకోవడంతో.. ఆ స్థానంలో మయాంక్ అగర్వాల్‌ను ఎంపిక చేసింది బీసీసీఐ. ధావన్, విజయ్ శంకర్ ఇద్దరు గాయం కారణంగా వైదొలిగిన రెండు సందర్భాల్లోనూ రాయుడు ప్రస్తావన వచ్చినప్పటికీ బోర్డు అతనిపై కరుణ చూపలేదు.
 

 

ధోనీపై విమర్శల వెల్లువ: సంజయ్ బంగర్ ఆగ్రహం

మహేంద్ర సింగ్ ధోనీపై వెల్లువెత్తుతున్న విమర్శలపై భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ధోనీ స్ట్రైక్ రేట్ పై నిత్యం విమర్శలు రావడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో ధోనీ బ్యాటింగ్ చేసిన తీరుపై తీవ్రమైన విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.

 

నన్ను అందంగా చూపించాలని ఆ నిర్మాత.. హీరోయిన్ కామెంట్స్!

బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న 'బూ.. సబ్కీ ఫటేగీ' అనే సినిమాలో మల్లికా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మల్లికా 'ది కపిల్ శర్మ' అనే షోలో పాల్గొన్నారు.

 

వెస్టిండీస్‌పై సెంచరీ: లంక యువ ఆటగాడు అరుదైన రికార్డు

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై లంక 23 పరుగుల తేడాతో గెలుపొందింది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో శ్రీలకం యువ ఆటగాడు అవిష్క ఫెర్నాండో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

కాగజ్ నగర్ ఘటన మరవకముందే భద్రాద్రి లో మరో ఘటన చోటుచేసుకుంది. ఇటీవల కాగజ్ నగర్ లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కోనేరు కృష్ణ  అటవీ శాఖ మహిళా అధికారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సంఘటనే మరోకటి చోటుచేసుకుంది.

click me!