టీం ఇండియా క్రికెటర్ విజయ శంకర్ వరల్డ్ కప్ నుంచి దూరమైన సంగతి తెలిసిందే. కాగా.. ఇప్పుడు విజయ శంకర్ నుంచి వరల్డ్ కప్ గాయం వల్ల కాకుండా.. కావాలనే పంపించారనే వాదనలు వినపడుతున్నాయి.

ఇంతకీ మ్యాటరేంటంటే... జూన్ 19వ తేదీన నెట్ లో ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు. ఆ గాయం మరింత పెద్దది కాకపోవడంతో... తర్వాతి రెండు మ్యాచుల్లో విజయ శంకర్ ఆడాడు.  సడెన్ గా నిన్నటికి నిన్న... గాయం తిరగపడిందంటూ వరల్డ్ కప్ నుంచి విజయ శంకర్ ని తొలగించారు. అతని స్థానంలో మయాంక అగర్వాల్ ని ఎంపిక చేశారు.

ఈ ఘటనపై టీం ఇండియా మాజీ క్రికెటర్ మురళీ కార్తీక్ ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ‘‘ఒకరోజు ముందు జట్టులో ఉన్నాడు. బ్యాటింగ్‌ బాగానే చేశాడు. దురదృష్టవశాత్తు ఓ మంచి బంతికి ఔటయ్యాడు. నిన్న(ఇంగ్లండ్‌తో మ్యాచ్‌ సందర్భంగా) గాయంతోనే చక్కగా పరుగెత్తుతూ డ్రింక్స్‌ అందించాడు. నేడు టోర్నీ నుంచి నిష్క్రమించాడు. వెంటనే మరొకరు భర్తీ అయ్యారు. దీంతో నేనొక్కడినే అయోమయానికి గురైనట్టున్నా?’‘ అంటూ తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.

దీంతో అభిమానుల్లోనూ ఇదే అనుమానం మొదలైంది. కావాలనే విజయ శంకర్ ని తొలగించి గాయం పేరుతో తీసేసామని అబద్ధాలు చేబుతున్నారని విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా బీసీసీఐపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందో చూడాలి.