Asianet News TeluguAsianet News Telugu

వెస్టిండీస్‌పై సెంచరీ: లంక యువ ఆటగాడు అరుదైన రికార్డు

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై లంక 23 పరుగుల తేడాతో గెలుపొందింది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో శ్రీలకం యువ ఆటగాడు అవిష్క ఫెర్నాండో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

srilanka cricketer avishka fernando record in srilanka-westindies match
Author
London, First Published Jul 2, 2019, 7:49 AM IST

ఐసీసీ ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్- శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో విండీస్‌పై లంక 23 పరుగుల తేడాతో గెలుపొందింది. నామమాత్రమైన ఈ మ్యాచ్‌లో శ్రీలకం యువ ఆటగాడు అవిష్క ఫెర్నాండో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన అవిష్క.. పిన్న వయసులోనే ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ లిస్ట్‌లో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిరింగ్ అగ్రస్థానంలో ఉన్నాడు.

20 సంవత్సరాల 196 రోజుల వయసులో స్టిరింగ్ ఈ రికార్డు సాధించాడు. ఇక 21 సంవత్సరాల 76 రోజుల్లో సెంచరీ సాధించి.. ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మూడో స్థానంలో ఉన్నాడు.

తాజాగా అవిష్క 21 సంవత్సరాల 87 రోజుల వయస్సులో సెంచరీ సాధించి అతను మూడో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాతి స్థానాల్లో 22 సంవత్సరాల 87 రోజుల వయస్సులో సెంచరీ చేసి కోహ్లీ.... 22 సంవత్సరాల 300 రోజుల్లో సెంచరీ చేసి సచిన్ టెండూల్కర్ వున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios