సాయి పల్లవి, రానా ఇద్దరిలో ఓ పోలిక ఉంది.. తాము నటించిన చిత్రాల్లో వైవిధ్యం ఉండాలని, నటనకు ప్రాధ్యానత ఉండాలని ఉండాలని ఇద్దరూ కోరుకుంటారు. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తున్నారు. వేణు ఊడుగుల దర్శకత్వంలో 1992 బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ఇటీవలే ప్రారంభమైన ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూర్తయింది. రానా లేకుండానే దర్శకుడు తొలి షెడ్యూల్ ని సాయి పల్లవిపై పూర్తి చేశాడు. తాజాగా షూటింగ్ లొకేషన్ లో సాయి పల్లవి ఫోటో లీకై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పల్లెటూరి యువతిగా సాయిపల్లవి సైకిల్ తొక్కుతున్న ఫోటో నెటిజన్లని ఆకర్షించే విధంగా ఉంది. 

ధరిపల్లి అనే గ్రామంలో తొలి షెడ్యూల్ చిత్రీకరించారు. రెండవ షెడ్యూల్ నుంచి రానా కూడా పాల్గొననున్నాడు. ఈ చిత్రంలో 1990 నాటి రాజకీయ అంశలని దర్శకుడు ఆసక్తికరంగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. రానా నక్సలైట్ గా, ఆ తర్వాత పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్లు టాక్.