టాక్సీవాలా సక్సెస్ అనంతరం విజయ్ దేవరకొండ నుంచి వస్తోన్న మరో డిఫరెంట్ మూవీ డియర్ కామ్రేడ్. గతంలో ఎప్పుడు లేని విధంగా మొదటి సారి విజయ్ సినిమా నాలుగు భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజైన టీజర్ అండ్ సాంగ్స్ కి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. 

ఇకపోతే సినిమాకు సంబందించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ యూత్ ని ఎక్కువగా ఆకర్షిస్తోంది. సినిమాలో రొమాంటిక్ డోస్ కూడా ఎక్కువేనట. రష్మిక మందన్నా మొదటి సారి సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించినట్టు టాక్ వస్తోంది. ముఖ్యంగా సెకండ్ ఆఫ్ లోప్ వచ్చే ఒక సాంగ్ లో గ్లామర్ డోస్ తో పాటు లిప్ లాక్ సీన్స్ కూడా కుర్రకారును ఎట్రాక్ట్ చేస్తాయని టాక్ వస్తోంది. 

సినిమాలో యాక్షన్ సన్నివేశాలు కూడా మాస్ ఆడియెన్స్ అంచనాలను అందుకుంటాయని చిత్ర యూనిట్ చెబుతోంది. విజయ్ దేవరకొండ ఈ  డిఫరెంట్ మూవీతో ఫ్యాన్స్ కి సరికొత్త కిక్ ఇవ్వనున్నాడని చెబుతున్నారు. తెలుగు - తమిళ్ అలాగే మలయాళం కన్నడ భాషల్లో డియర్ కామ్రేడ్ టైటిల్ తో ఈ నెల 26న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.