ఒకప్పటి స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లు కలిసి ఓ వేడుకలో సందడి చేశారు. ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు. సోమవారం రాత్రి గ్రాండ్ గా ఈ వేడుకను నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, దిల్ రాజు, సంగీత దర్శకుడు కోటి ఇలా ఇండస్ట్రీకి చెందిన ఎందరో సెలబ్రిటీలు హాజరయ్యారు. దర్శకుడిగా కోదండరామిరెడ్డి  ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. చిరు, బాలయ్య ఇలా అప్పట్లో స్టార్ హీరోలందరినీ డైరెక్ట్ చేశారు.