బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న 'బూ.. సబ్కీ ఫటేగీ' అనే సినిమాలో మల్లికా కీలకపాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో సినిమా ప్రచార కార్యక్రమంలో భాగంగా మల్లికా 'ది కపిల్ శర్మ' అనే షోలో పాల్గొన్నారు.

ఈ క్రమంలో ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. ఓ నిర్మాత నుండి తాను ఎదుర్కొన్న సంఘటనను ఈ షో ద్వారా వెల్లడించింది. ఓ సినిమాలో తనను అందంగా చూపించడం కోసం నడుము, ఉదర భాగాన్ని హైలైట్ చేయాలనుకున్నారట. దీనికోసం తన ఉదర భాగంపై కోడిగుడ్లు పెట్టి ఓ సన్నివేశాన్ని తెరకెక్కించాలనుకున్నారట. 

ఆ విషయాన్ని నిర్మాత చెప్పగానే మల్లికా చేయనని కచ్చితంగా చెప్పేశారట. అలాంటి వికృతకరమైన సన్నివేశాల్లో నేను ఎప్పటికీ నటించలేనని అంటోంది మల్లికా.. అయితే ఆమె కోపిష్టి అని, ఎక్కువగా మాట్లాడుతుంటుందని.. సినిమాలో ఆమెకి అవకాశం ఇచ్చినట్లు ఇచ్చి తొలగించేవారని తెలిపింది.

అలా దాదాపు 30 సినిమాల వరకు చేజార్చుకున్నానని చెప్పుకొచ్చింది. తనను తొలగించి ఆ స్థానంలో పలువురు హీరోలు తమ ప్రియురాళ్లకు అవకాశాలు ఇచ్చుకునేవారని  వెల్లడించింది.