చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే హేమలత బీజేపీలో చేరారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున సత్యవేడు నుంచి గెలిచిన హేమలత 2014, 2019 ఎన్నికల్లో టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో సైతం టీడీపీ అభ్యర్ధి జేడీ రాజశేఖర్ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. తాజా ఎన్నికల్లో తెలుగుదేశం అధికారం కోల్పోవడంతో పాటు పార్టీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న హేమలత సోమవారం గుంటూరులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆమెతో పాటు నాగలాపురం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మూర్తిరెడ్డి సైతం బీజేపీలో చేరారు.