సూపర్ స్టార్ మహేష్ బాబు వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి. అయినా కూడా ఏదో ఒక వివాదం సెలబ్రిటీలని వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవల కృష్ణ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణ సతీమణి విజయనిర్మల మరణించిన సంగతి తెలిసిందే. దీనితో కృష్ణని పరామర్శించడానికి సినీ రాజకీయ ప్రముఖులు ఆయన నివాసానికి క్యూ కట్టారు. 

మహేష్ బాబు కూడా అక్కడే ఉన్నాడు. కాగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృష్ణని పరామర్శించడానికి వచ్చిన సమయంలో మహేష్ అక్కడ లేడు. ఇది కాస్త సోషల్ మీడియాలో అభిమానుల మధ్య చర్చకు దారి తీసింది. మహేష్ తన కార్యక్రమాలతో తాను బిజీగా ఉండడం వల్ల జగన్ వచ్చిన సమయంలో అక్కడ లేడని కొందరు అంటున్నారు. 

కానీ ప్రతిపక్ష నేత చంద్రబాబు వచ్చిన సమయంలో మాత్రం మహేష్ బాలకృష్ణ పక్కనే కూర్చుని కనిపించాడు. చంద్రబాబు, బాలయ్య కలసి వెళ్లి కృష్ణని పరామర్శించారు. జగన్ రాక గురించి మహేష్ బాబుకు సమాచారం లేకపోయి ఉండొచ్చని లేదా బిజీగా అయినా ఉండొచ్చని కొందరు పేర్కొంటున్నారు. 

ఇది అంత వివాదభరిత అంశం కాదు.. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోతుంది. సీఎం వచ్చిన సమయంలో సూపర్ స్టార్ మహేష్ అక్కడ లేకపోవడం చర్చకు దారితీసింది.