న్యూఢిల్లీ: ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా ఆదివారం ఇంగ్లాండుపై జరిగిన మ్యాచులో భారత్ ఓటమిపై మహింద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహింద్రా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండుపై భారత్ ఓటమి తర్వాత ఆయన పాకిస్తాన్ జట్టును ఉద్దేశిస్తూ ట్వీట్లు చేశారు.  

ఇంగ్లాండ్‌తో చెస్‌ తరహాలో టీమిండియా ఎత్తులకు పైఎత్తులు వేసి పాక్‌ను సెమీస్‌ రేసు నుంచి ఔట్‌ చేసిందని ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యానించారు. 1992 ప్రపంచకప్ నాటి పరిస్థితులే పాక్‌కు పునరావృతం అవుతున్నాయనే వ్యాఖ్యలను ఆయన కొట్టిపారేశారు.  ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్‌లు అప్పటిని గుర్తు చేస్తున్నాయనే వాదనలో పసలేదని, చరిత్ర ఎప్పటికి పునరావృతం కాదని అన్నారు. 

పాకిస్తాన్‌కు కప్‌ కొట్టె సీన్‌ లేదని ఆయన వ్యాఖ్యానించారు. అయితే అయితే, పాకిస్తాన్ సెమీ ఫైనల్ ఆశలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. న్యూజిలాండ్‌ చేతిలో ఇంగ్లండ్‌ ఓటమి పాలై బంగ్లాదేశ్‌పై తాను గెలిస్తే పాకిస్తాన్‌ 11 పాయింట్లతో సెమీస్‌ బెర్త్‌ దక్కించుకుంటుంది.