కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డిప్యూటీ పారెస్ట్ ఆఫీసర్‌కు  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫోన్ చేసిన ఆడియో సంభాషణ ప్రస్తుతం సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది.

డిప్యూటీ ఫారెస్ట్ ఆఫీసర్‌కు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫోన్ చేసినట్టుగా ఆడియోలో ఉంది.  అనవసరంగా ప్రజలను  ఇబ్బందులు పెట్టొద్దని  వనమా వెంకటేశ్వరరావు సూచించారు.  అవసరమైతే తన గురించి  మీ ఉన్నతాధికారులకు చెప్పాలని కూడ ఎమ్మెల్యే చెప్పినట్టుగా ఈ ఆడియోలో ఉందంటున్నారు..

మరో వైపు  అటవీశాఖ భూమిలో  నిర్మాణాలు చేపట్టిన విషయాన్ని  ప్రశ్నించినందుకుగాను ఎమ్మెల్యే తనయుడు రాఘవేందర్ రావు బెదిరించారని ఫారెస్ట్ అదికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఇదే విషయమై ఎమ్మెల్యే కూడ తమతో అనుచితంగా మాట్లాడారని ఫారెస్ట్ అధికారులు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు  మాత్రం తనపై ఫారెస్ట్ అధికారులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఆదీవాసీలకు పట్టాలు ఉన్నా కూడ ఫారెస్ట్ అధికారులు వినడం లేదని ఆయన ఆరోపించారు. ఉద్దేశ్యపూర్వకంగానే తనపై ఫారెస్ట్ అధికారులు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.పోడు భూముల సమస్యలను సీఎం దృష్టికి తీసుకురానున్నట్టు చెప్పారు.

సంబంధిత వార్తలు

మరో అటవీ శాఖ అధికారిపై దాడి