1963లో వచ్చిన లవ కుశ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. అందులో లవ కుశ పాత్రల్లో నటించిన నాగరాజు - సుబ్రమన్యం ఆ ఒక్క సినిమాతో మరచిపోలేని గుర్తింపు తెచ్చుకున్నారు., అయితే ఒకప్పటి ఆ చిన్నారులు ఇప్పుడు ఏడు పదుల వయసులోకి వచ్చేశారు. 

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుత సినిమాలపై అలనాటి లవకుశలు అసహనం వ్యక్తం చేశారు. భారతీయ నాగరికతను నేటి సినిమాలు చాలా దెబ్బ తీస్తున్నాయని ముఖ్యంగా హీరోయిన్స్ అంగాంగ ప్రదర్శన యువతను తప్పుదోవ పట్టిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా ప్రస్తుతం సినిమాలు, సీరియల్స్ యువతను మార్చివేస్తునట్లు చెబుతూ.. అందరికి స్ఫూర్తినిచ్చేలా సినిమాలు రావడం లేదని అన్నారు. 

ఎంతైనా సమాజానికి ఉపయోగపడే సినిమాలు తీయాల్సిన బాధ్యత అందరికి ఉందంటూ.. అప్పట్లో హిందూ సాంప్రదాయం ఉట్టిపడేలా కట్టు బొట్టు ఉండేదని కానీ ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారని ఈ లవకుశలు వారి వివరణను ఇచ్చారు.