మెగాహీరో వరుణ్ తేజ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'వాల్మీకి'. అయితే ఈ సినిమా టైటిల్ మార్చమని వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. అది సర్దుకోవడంతో షూటింగ్ మొదలుపెట్టి కొంతభాగం చిత్రీకరణ పూర్తి చేశారు.

తాజాగా సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ జరపడానికి దర్శకుడు హరీష్ శంకర్ తన చిత్రబృందంతో  కలిసి అనంతపూర్ వెళ్లారు. అక్కడ బోయ కులానికి చెందిన కొందరు వ్యక్తులు షూటింగ్ దగ్గరకి వచ్చి నానా గొడవ చేసినట్లు సమాచారం. 

తమ కులానికి చెందిన వ్యక్తి పేరుని టైటిల్ గా పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ షూటింగ్ జరక్కుండా అడ్డుకున్నారట. దీంతో హరీష్ శంకర్ వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. వారు మాత్రం వినలేదట. 

సినిమాలో ఎక్కడా వాల్మీకిని కించపరిచే విధంగా సన్నివేశాలు ఉండవని ఎంతగా చెప్పినా వారు వినకపోవడంతో చేసేదేమీ లేక షూటింగ్ క్యాన్సిల్ చేశాడట. తను అనుకున్నట్లుగా అక్కడ షూటింగ్ జరిపే ఛాన్స్ లేకపోవడంతో తిరిగి హైదరాబాద్ కి వచ్చేసినట్లు తెలుస్తోంది.

అదే షెడ్యూల్ ని చేవెల్ల ప్రాంత పరిధుల్లో నిర్వహించాలని చూస్తున్నారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఓ గూండా మంచి మనిషిగా మారి సమాజానికి సేవ ఎలా చేశాడనే కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కుతోంది.