26/11 ముంబై ఉగ్రవాద దాడుల సూత్రధారి తహవ్వూర్ రాణాను అమెరికా నుంచి భారతదేశానికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. NIA అతన్ని అరెస్టు చేసింది. పాటియాలా హౌస్ కోర్టు అతన్ని 18 రోజుల రిమాండ్‌కు పంపింది. తెలంగాణలో భూకంపం వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. వీటితో పాటు ఇతర జాతీయ, అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు మీకోసం..

11:52 PM (IST) Apr 11
భారతదేశం తీవ్రమైన ఎండలతో మండిపోతోంది. ఈ క్రమంలో సింగపూర్ యొక్క వినూత్న శీతలీకరణ వ్యూహాలు మరియు పచ్చని పట్టణ రూపకల్పన వంటివి భారత్ అనుకరించదగిన నమూనాని అందిస్తున్నాయి. ఈ వ్యవస్థలు నగరాలను చల్లబరచడమే కాకుండా, వాటిని ఆరోగ్యంగా, మరింత సరసమైనవిగా కూడా చేస్తాయి.
పూర్తి కథనం చదవండి11:50 PM (IST) Apr 11
CSK vs KKR IPL 2025: ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) చెత్త ప్రదర్శనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓటములు చూస్తూనే ఉంది. మరోసారి తన సొంత గ్రౌండ్ లోనే చిత్తుగా ఓడిపోయింది. ఎంఎస్ ధోని కెప్టెన్ గా తిరిగివచ్చినా చేపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది.
11:19 PM (IST) Apr 11
CSK vs KKR IPL 2025: ఐపీఎల్ 2025లో క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని కెప్టెన్ గా తిరిగివచ్చినా చేపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ హ్యాట్రిక్ పరాజయాలకు అడ్డుకట్ట వేయలేకపోయాడు. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది.
11:05 PM (IST) Apr 11
అమెరికా, చైనా వస్తువులపై పన్నుల వల్ల ప్రపంచ మార్కెట్‌లో మార్పులు వచ్చాయి. దీనివల్ల మనదేశంలో కొన్ని దిగుమతి వస్తువులు తక్కువ ధరకే రావొచ్చు. కానీ అమెరికాలో రేట్లు పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రపంచ సరఫరా వ్యవస్థలో మార్పులకు దారి తీయొచ్చు.
పూర్తి కథనం చదవండి10:42 PM (IST) Apr 11
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్కడ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే ఏఐఏడిఎంకే పొత్తు ఖరారయ్యింది. ఈ క్రమంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా నయనార్ నాగెంద్రన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంతకూ ఎవరీ నాగేంద్రన్? అన్నామలైని తప్పించి ఈయనకు పార్టీ పగ్గాలు అప్పగించడం వెనక ఆంతర్యమేమిటి? ఇక్కడ తెలుసుకుందాం.
10:05 PM (IST) Apr 11
మండు వేసవిలో వాతావరణం విచిత్రంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఇలా దేశ రాజధాని డిల్లీలో ఇవాళ వాతావరణం భీభత్సం సృష్టించింది. ఏకంగా 15 విమానాలనే దారి మళ్లించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
పూర్తి కథనం చదవండి10:03 PM (IST) Apr 11
Guru Planet Transit 2025 Effect On Zodiac: బృహస్పతి గ్రహం (గురు గ్రహం) 2025లో మృగశిర నక్షత్రం లోకి ప్రవేశించాడు. ఇది జ్యోతిష్య శాస్త్రంలో చాలా ప్రత్యేకమైన సంఘటన. మృగశిర నక్షత్రంలోకి గురు గ్రహం సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అనేక లాభాలు, సానుకూల పరిస్థితులు రావడంతో పాటు వారికి లక్ కూడా కలిసి వస్తుంది.
09:38 PM (IST) Apr 11
కేవలం 7 నెలల క్రితం ఇండియాలోకి లాంచ్ అయిన కారు అది. ప్రారంభమైన నెల తర్వాత అమ్మకాలు స్టార్ట్ అయ్యాయి. అంతే 6 నెలలు గడిచేలోగా ఏకంగా 20 వేల కార్లు అమ్ముడయ్యాయి. ఈ మైలురాయిని చేరుకుని దేశంలోనే వేగవంతమైన ఎలక్ట్రిక్ కారుగా నిలిచిన ఆ కారు గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా?.
పూర్తి కథనం చదవండి09:16 PM (IST) Apr 11
ఏప్రిల్ 2025 లో ఇప్పటికే వరుస సెలవులు వచ్చాయి. ఇకపై కూడా మరిన్ని సెలవులు వస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చేవారం ఎనిమిదిరోజుల్లో కేవలం మూడ్రోజులు మాత్రమే పూర్తిగా అన్నిస్కూళ్లు నడుస్తాయి. మిగతారోజుల్లో సెలవులే సెలవులు. ఏరోజు ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి09:15 PM (IST) Apr 11
MS Dhoni: మార్చి 30న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మోచేయి గాయం కారణంగా 2025 ఐపీఎల్ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. దీంతో 43 ఏళ్ల ధోని మళ్లీ చెన్నై కెప్టెన్ గా తిరిగొచ్చాడు. మరో రికార్డును బద్దలు కొట్టాడు.
09:03 PM (IST) Apr 11
Heart Attack: చాలా వరకు ఆఫీసుల్లో కాఫీ మెషీన్‌లే ఉంటాయి. దీంతో అందరూ ఆ కాఫీలే తాగుతారు. అయితే మెషీన్ కాఫీ తాగితే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.
08:09 PM (IST) Apr 11
BJP - AIADMK Alliance: 2023లో విబేధాల కారణంగా విడిపోయిన బీజేపీ-ఎఐఏడీఎంకే మళ్లీ కలవడం ఇప్పటి తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్‌ను ఓడించాలన్నే లక్ష్యంతో అమిత్ షా – ఎడప్పాడి కె.పళనిస్వామి (EPS) మధ్య మార్చి 25న భేటీ జరిగింది. ఈ భేటీతో పొత్తు పునరుద్ధరణకు బలమైన సంకేతాలు వచ్చాయి.
పూర్తి కథనం చదవండి07:57 PM (IST) Apr 11
TG TET 2025 Notification: తెలంగాణ టెట్ 2025 నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్రంలో 1 నుండి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా నియామకం కావాలనుకునే అభ్యర్థుల అర్హతను నిర్ణయించడానికి తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (Telangana Teacher Eligibility Test - TG TET) పరీక్షను నిర్వహిస్తుంది.
07:46 PM (IST) Apr 11
Daily Chant Mantras: జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి చక్కటి జీవన విధానాన్ని పాటించడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో మార్గాలను సూచిస్తుంది. వాటిల్లో ఒకటి మంత్రాలు పఠించడం. ఏ రోజు ఏ మంత్రం జపిస్తే ఆనందం, ఆరోగ్యం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి07:30 PM (IST) Apr 11
స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. తద్వారా వాట్సాప్ యూజర్ల మరింత ఉపయోగకరంగా మారనుంది. ఇంతకూ వాట్సాప్ లో వచ్చిన ఆ కొత్తఫీచర్లు ఏమిటో తెలుసా?
పూర్తి కథనం చదవండి06:42 PM (IST) Apr 11
2026 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే-బీజేపీ కూటమి ఉంటుందని అమిత్ షా స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం చెన్నై పర్యటనలో ఉన్న షా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈపీఎస్ సమక్షంలో అమిత్ షా ఈ విషయాన్ని ప్రకటించారు.
పూర్తి కథనం చదవండి05:48 PM (IST) Apr 11
స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ రీల్స్ చూస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువత రీల్స్‌కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఒక రీల్ చూద్దామని మొదలు పెట్టి గంటల తరబడి చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే స్క్రీన్ స్క్రోల్ చేసి చేసి వేళ్లు నొప్పి పుడుతుంటాయి. అయితే ఇలా స్క్రోల్ చేయకుండా వాయిస్ కమాండ్‌తో రీల్స్‌ను ఆపరేట్ చేసుకుంటే భలే ఉంటుంది కదూ!
05:10 PM (IST) Apr 11
మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీకింకా పెళ్లికాలేదా? అయితే మీ వర్క్-లైఫ్ న్య బ్యాలన్స్ గా ఉంచుకోవాలంటే సహోద్యోగిని పెళ్లాడితే సరిపోతుందట. దీనివల్ల ఇంకా ఎన్నో లాభాలున్నాయని ఓ బెంగళూరు వ్యక్తి సూచిస్తున్నాడు. ఆ లాభాలేమిటో ఇక్కడ చూద్దాం.
పూర్తి కథనం చదవండి05:05 PM (IST) Apr 11
సమంత రూత్ ప్రభు , తమన్నా భాటియా, వంటి స్టార్ల్ హీరోయిన్లు నటించిన కొన్ని డ్యాన్స్ నంబర్లు సినిమాలనే మించిపోయాయి. ఆజ్ కి రాత్, ఊ అంటావా పాటల్లో వాళ్ల ఎలక్ట్రిఫైయింగ్ పెర్ఫార్మెన్స్ సెన్సేషన్ అయ్యాయి. డ్యాన్స్ ఐకాన్లుగా ఆ తారలు నిరూపించుకున్నారు.
పూర్తి కథనం చదవండి04:58 PM (IST) Apr 11
SP Balasubrahmanyam: గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం టాలెంట్ గురించి, ఆ కమ్మటి గొంతుతో పాడిన పాటలను ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. సినిమా రంగంలో నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడిగా అనేక పాత్రలను పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. కోవిడ్ సమయంలో భౌతికంగా ఆయన దూరం అయినప్పటికీ... సినీరంగంలో బాలు ముద్రను ప్రేక్షకుల మనసుల్లోన్నుంచి ఎవరూ తీసివేయలేదు. గతంలో బాలు తన సినీ జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో సంతోషాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు. వివిధ భాషాల్లో సింగింగ్ ప్రపంచంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరిన ఆయన.. ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకుందాం రండి..
04:29 PM (IST) Apr 11
ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటోంది. అందులోనూ కెమెరాకు అధిక ప్రాధాన్యత ఉన్న ఫోన్‌లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ చిన్న సందర్భాన్ని ఫొటోలో బంధించి వెంటనే సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఫొటోలను ప్రత్యేకంగా ఎడిట్ కూడా చేస్తుంటారు. అయితే గూగుల్ ఫొటోస్‌లో ప్రత్యేకంగా కొన్ని ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయని మీకు తెలుసా.?
04:16 PM (IST) Apr 11
Toothpaste: ప్రతి రోజూ బ్రష్ చేసేటప్పుడు మీ టూత్ బ్రష్ మీద ఎంత పేస్టు వేసుకుంటున్నారు? సాధారణంగా బ్రష్ నిండా పేస్టు వేసుకోవడం మనందరికీ అలవాటు కదా.. కాని దీని వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా? ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి03:56 PM (IST) Apr 11
ఏ చిన్న విషయం అయినా సరే మొదట సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. ఇప్పడు చాలా మందికి ఈ అలవాటు కామన్‌గా మారిపోయింది. ఉదయం టిఫిన్ మొదలు రాత్రి డిన్నర్ వరకు అన్ని అప్డేట్స్ పోస్ట్ చేయాల్సిందే. అయితే ఈ ట్రెండ్‌ను కేవలం సామాన్యులే కాదు సెలబ్రిటీలు సైతం ఫాలో అవుతున్నారు. చివరికి రాజకీయ నాయకులు సైతం ఫాలో అవుతున్నారు. తాజాగా ఓ రాజకీయ నాయకుడి ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
03:49 PM (IST) Apr 11
మే 13 నుండి మే 24 వరకు జరగనున్న 78వ కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్ నటించిన 'హోమ్‌బౌండ్' చిత్రం ప్రదర్శనకు ఎంపికైంది.
03:41 PM (IST) Apr 11
శివకార్తికేయన్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ అమరన్ కలెక్షన్ల రికార్డును గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీ బ్రేక్ చేయలేకపోయింది.
పూర్తి కథనం చదవండి02:20 PM (IST) Apr 11
PM Modi In Varanasi: గత 10 ఏళ్లలో వారణాసి అభివృద్ధి వేగంగా జరిగిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాశీ కేవలం పురాతన నగరం మాత్రమే కాదు, ఇది అభివృద్ధి చెందుతున్న నగరమని స్పష్టం చేశారు. తాజాగా శుక్రవారం వారణాసిలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తి కథనం చదవండి
01:37 PM (IST) Apr 11
DeepSeek-ChatGPT: ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ యుగం నడుస్తోంది. కృత్రిమ మేధస్సు అన్ని రంగాల్లోనూ ప్రవేశించింది. ఇక చైనా అభివృద్ది చేసిన డీప్‌సీక్, అమెరికా తీసుకొచ్చి చాట్ జీపీటీ ఏఐ ఫ్లాట్‌ఫాంలు మార్కెట్లో అడుగుపెట్టాయి. ఈ రెండు ఫ్లాట్‌ఫాంలు తొలిరోజుల్లో వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఆరంభంలో డీప్‌సీక్ చాట్‌జీపీటీని వెనక్కి నెట్టేస్తుందా అన్నట్లు దూసుకెళ్లింది. కానీ డీప్‌సీక్ వినియోగదారులను పెంచుకోవడంలో విఫలమవుతోందని ఇది పతనానికి దారితీస్తుందని టెక్ దిగ్గజాలు అభిప్రాయపడుతున్నారు. దీనికి కారణం ఏంటి? అన్న వివరాలు తెలుసుకుందాం.
01:29 PM (IST) Apr 11
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ఊహకందని సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అదీఇదని కాదు అన్నిరంగాల్లో ఈ ఏఐ అద్భుతాలు చేస్తోంది. వైద్యరంగంలో కూడా ఈ ఏఐ సేవలు మొదలయ్యింది. చివరకు ఓ మహిళను ఈ ఏఐ తల్లిని చేసింది. ఈ వింత వ్యవహారం గురించి ఇక్కడ తెలుసుకుందాం...
పూర్తి కథనం చదవండి12:22 PM (IST) Apr 11
మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడాలంటే వినూత్నంగా ఆలోచించాలి అప్పుడే సక్సెస్ అవుతారు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే క్రమంలో సరికొత్త ఎత్తుగడలు వేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కూల్‌క్రింక్స్ సంస్థ కొకాకోలా సరికొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసింది. ఇంతకీ ఏంటా ప్రొడక్ట్.? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
12:05 PM (IST) Apr 11
AP Inter Results: ఏపీలోని కూటమి సర్కార్ ప్రతి ప్రభుత్వ విభాగానికి టెక్నాలజీ జోడిస్తోంది. ఏఐ, చాట్‌జీపీటీ, డ్రోన్ టెక్నాలజీ ఇలా అన్ని రకాలుగా వినియోగించుకుంటున్నారు. దీనిలో భాగంగా మన మిత్ర వాట్సప్ సర్వీసులను ఇటీవల ప్రారంభించారు. దీని ద్వారా 160 సేవలను ప్రజలు ఉచితంగా పొందేలా సర్వీసును తీసుకొచ్చారు. అయితే.. మరో రెండు రోజుల్లో ఇంటర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. వీటిని కూడా వాట్సప్‌లో విడుదల చేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. మరి ఫలితాలు ఏవిధంగా చూసుకోవాలో తెలుసుకోండిలా....
11:56 AM (IST) Apr 11
AI Assisted IVF Baby: కృత్రిమ విధానంలో పిల్లలు పుట్టించే పద్ధతులు ఇప్పుడు మరింత అడ్వాన్స్ అయ్యాయి. ఎందుకంటే వాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. AI సాయంతో ప్రపంచంలోనే తొలిసారి శిశువు జన్మించింది. ఇది ఎక్కడ జరిగింది? డాక్టర్లు ఎలాంటి విధానాలు పాటించారు? తదితర ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:23 AM (IST) Apr 11
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందుతుండగా, దీనిపై అజిత్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం.
పూర్తి కథనం చదవండి11:15 AM (IST) Apr 11
మోహన్ లాల్ నటించిన 'ఎంపురాన్' సినిమా వివాదంపై నటుడు అభిమన్యు సింగ్ మాట్లాడారు. దాని గురించి తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి11:09 AM (IST) Apr 11
KL Rahul's Triumphant Celebration: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో ఆర్సీబీపై కేఎల్ రాహుల్ 93 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించాడు. గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ 'ఇది నా గ్రౌండ్, నేనే కింగ్' అంటూ సంబరాలు చేసుకున్నాడు. తనదైన స్టైల్లో ఆర్సీబీ ఫ్రాంచైజీకి షాక్ ఇచ్చాడు.
పూర్తి కథనం చదవండి11:05 AM (IST) Apr 11
26/11 ముంబై ఉగ్రదాడి సూత్రధారి తహవ్వూర్ హుస్సేన్ రాణాను కాలిఫోర్నియాలో NIA బృందానికి, MEA ప్రతినిధులకు US మార్షల్స్ అప్పగించిన తొలి ఫోటోలు బయటకొచ్చాయి. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరణహోమానికి కారణమై ఎంతో మంది అమాయకుల ప్రజల ప్రాణాలు తీసిన రాణాకు తగిన శాస్తి జరగాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
పూర్తి కథనం చదవండి10:35 AM (IST) Apr 11
Brain: మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం. ఇది స్ట్రాంగ్ గా , షార్ప్ గా ఉంటేనే ఏ పనైనా చేయగలం. కానీ మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ పొరపాట్లు, వాటిని చేయకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్తి కథనం చదవండి10:20 AM (IST) Apr 11
olympics cricket india: లాస్ ఏంజిల్స్ లో జరిగే 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను టీ20 ఫార్మాట్‌లో కొనసాగించనున్నారు. పురుషులు, మహిళల పోటీలలో ఆరు జట్లు పోటీపడనున్నాయి. తాజాగా ఒలింపిక్ కమిటీ సంబంధిత వివరాలు అధికారికంగా ప్రకటించింది.
10:16 AM (IST) Apr 11
Ram Charan RRR: మన జెక్కన్న దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ సినిమా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులను తెచ్చిపెట్టింది. సినిమాలకు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన అకాడమీ అవార్డులుగా పిలిచే ఆస్కార్‌కు కూడా ఎంపికైంది. తాజాగా ఆస్కార్ అవార్డుల్లో ఓ కొత్త కేటగిరీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. ఆ కేటగిరీకి ట్రిపుల్ ఆర్‌లో నటించి రాంచరణ్ ఫొటోను వినియోగించడం ప్రత్యేకం... ఆ కేటగిరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
09:50 AM (IST) Apr 11
ప్రేమ.. రెండు అక్షరాల మహా కావ్యం. ఎప్పుడు, ఎలా, ఎక్కడ పుడుతుందో ఎవరికీ తెలియదు. ప్రేమకు భాష, కులం, మతంతో సంబంధం లేదని అంటుంటారు. అయితే ప్రేమకు ప్రాంతంతో కూడా సంబంధం లేదని నిరూపించారు ఓ జంట. ఎక్కడో అమెరికాకు చెందిన అమ్మాయి ఆంధ్రప్రదేశ్ అబ్బాయితో ప్రేమలో పడింది. అది కూడా ఇన్‌స్టాగ్రామ్ పరిచయంతో. ఈ వింత సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..