- Home
- Entertainment
- SP Balasubrahmanyam: అందుకే ఆ పాటలు పాడలేదు.. సింగర్ కావడం వల్ల జీవితం కోల్పోయా.. బాలు షాకింగ్ కామెంట్స్!
SP Balasubrahmanyam: అందుకే ఆ పాటలు పాడలేదు.. సింగర్ కావడం వల్ల జీవితం కోల్పోయా.. బాలు షాకింగ్ కామెంట్స్!
SP Balasubrahmanyam: గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం టాలెంట్ గురించి, ఆ కమ్మటి గొంతుతో పాడిన పాటలను ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. సినిమా రంగంలో నేపథ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడిగా అనేక పాత్రలను పోషించారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడారు. కోవిడ్ సమయంలో భౌతికంగా ఆయన దూరం అయినప్పటికీ... సినీరంగంలో బాలు ముద్రను ప్రేక్షకుల మనసుల్లోన్నుంచి ఎవరూ తీసివేయలేదు. గతంలో బాలు తన సినీ జర్నీ గురించి ఓ ఇంటర్వ్యూలో పలు వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన తర్వాత ఎన్నో సంతోషాలను కోల్పోయినట్లు చెప్పుకొచ్చారు. వివిధ భాషాల్లో సింగింగ్ ప్రపంచంలో ఎన్నో ఉన్నత శిఖరాలకు చేరిన ఆయన.. ఎందుకలా మాట్లాడాల్సి వచ్చిందో తెలుసుకుందాం రండి..
- FB
- TW
- Linkdin
Follow Us
)
sp balasubrahmanyam ilaiyaraaja
బాలు 1946 జూన్ 4న ఏపీలోని నెల్లూరు జిల్లాలో జన్మించారు. తండ్రి హరికథా కళాకారుడు. దీంతో బాలుకు చిన్ననాటి నుంచే సంగీతం మీద ఆశక్తి పెరిగింది. చిన్ననాటి నుంచి పాటలు పాడటం అలవాటుగా మార్చుకున్న బాలు మద్రాసులో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇక చదువుకుంటూనే అనే వేదికల మీద పాటలు పాడుతూ బహుమతులు పొందారు. తన ప్రతిభను గుర్తించి బాలు గురువు కోదండపాణి అనేక సినిమా స్టూడియోలకు తీసుకెళ్లి బాలు బాగాపాడతాడు అవకాశం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారంట. అలా అనేక మందిని కలిసిన తర్వాత 1966 లో తొలిసారిగా పద్మనాభం నిర్మించిన శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న చిత్రంతో గాయకుడిగా తొలిపాట అవకాశం దక్కించుకున్నారు బాలు.
sp balu with ghantasala
బాలు గురువు ఎప్పుడూ ఒక మాట అనేవారంట.. నువ్వు క్రమశిక్షణతో ఉంటే 40 ఏళ్ల పాటు సినిమా రంగంలో పాటలు పాడుతూనే ఉంటావని. ఆయన అన్నట్లుగానే అవకాశాలు వచ్చాయని, వేల పాటలు పాడగలిగానని అంటున్నారు. నేటి సింగర్స్‌కి అలాంటి ప్రోత్సాహం లభించడం లేదని అన్నారు. మొదట్లో తను పాడిన పాటలను తనే వింటుంటే చిరాకు వచ్చేదని బాలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసలు నా పాటలు ఎందుకు సినిమాల్లో పెడుతున్నారు, సరిగా పాడలేదు కదా అన్న భావన ఉండేదట.
sp balu rare photos
సింగర్లు అక్షరాలు పలకడంలో చాలా మెళకువలు నేర్చుకోవాలని బాలు అంటున్నారు. తొలినాళ్లలో ఈ విషయంలోనే చాలా వెనుకబడి ఉండేవారని చెప్పారు. అప్పటికే ఉన్న సింగర్ సుశీలమ్మ కొన్ని అక్షరాలను పలుకుతున్న తీరును దగ్గరి నుంచి చూసి గమనించి అలా నెమ్మదిగా తప్పులను సరిచేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక నేటి తరం మూజిక్ డైరెక్టర్ కొత్తే, రైటర్ కొత్తే.. పాడే వారు కొత్తే. కాబట్టి ఏదిపడితే అది వారికి నచ్చినట్లుగా పాడుకుంటున్నారని బాలు అన్నారు.
sp balasubrahmanyam rajinikanth
పనిగట్టకుని సుందరరామూర్తితో కథకోసం లేదో ఏ ఉద్దేశంతోనే బూతుపాటలను కొందరు దర్శకులు రాయించుకునేవారని బాలు అన్నారు. అలాంటి పాటలను చాలా వరకు రిజెక్ట్ చేసినట్లు ఆయన చెబుతున్నారు. ఈ విషయంలో మోహన్‌బాబు కూడా తనపై చాలాసార్లు కోపం వ్యక్తం చేశారన్నారు. ఇక దర్శకరత్న రాఘవేంద్రరావు సైతం ఒక్కపాటైనా పాడాలని బతిమాలేవారని అయినా సరే తాను ఆ పదాలు నా నోటి నుంచి పలకను అని చెప్పినట్లు బాలు అన్నారు. తొలిరోజుల్లో ఘంటసాల వాయిస్‌కి పోలినట్లు రామకృష్ణ అనే సింగర్ వాయిస్ ఉండేదని దీంతో ఆయనకు అనేక అవకాశాలు వచ్చాయన్నారు బాలు. అప్పటి వరకు తనకు అవకాశం ఇచ్చిన హీరోలు నాగేశ్వరరావు, కృష్ణంరాజు, శోభన్‌బాబు రామకృష్ణకే అవకాశం ఇచ్చారని అన్నారు.
sp balu with his son charan
మిగిలిన హీరోలు అవకాశం ఇవ్వకున్నా.. సూపర్ స్టార్ కృష్ణ మాత్రం బాలుకి సింగర్‌గా అప్పట్లో అవకాశాలు ఇస్తూనే ఉన్నారంట. ఇటు హీరో కృష్ణకు, మరోవైపు కమెడియన్లకు బాలు పాటలు పాడుతూనే ఉన్నారంట. అయితే.. కృష్ణ ఒకరోజు ఫోన్ చేసి తాను నటించే అన్ని సినిమాల్లో పాడమని బాలుకి చెప్పి.. ఓ కండిషన్ పెట్టారంట. కమెడియన్లకు పాడకు.. పాడితే హీరోలకు పాడు అని సూచించారంట. కొన్ని అనివార్య కారణాలతో అలా చేయలేకపోయానని బాలు చెప్పుకొచ్చారు. పాటల పోటీ ప్రపంచంలో ఎదుటి వారితో పోటీగా అవకాశాలు దక్కించుకోవాలనే తాపత్రయంలో తాను వ్యక్తిగత, కుటుంబ జీవితం కోల్పోయినట్లు బాలు చెప్పారు. తనని నమ్ముకుని వచ్చిన భార్యను, పిల్లలను చూసుకునే సమయం, వారితో గడిపే సమయం కేటాయించలేక పోయానని బాలు బాధపడ్డారు. పోటీ ప్రపంచంలో పడి పిల్లల ఎదుగుదల, వారి ఇష్టాలు, కష్టాలను పంచుకోలేకపోయానని చెప్పుకొచ్చారు బాలు.