userpic
user icon
0 Min read

KL Rahul: ఇది నా గ్రౌండ్, ఇక్కడ నేనే కింగ్.. ఆర్సీబీకి కేఎల్ రాహుల్ కౌంటర్

KL Rahul's Triumphant Celebration Against RCB IPL  Chinnaswamy Stadium, Bengaluru in telugu rma
KL Rahul's Triumphant Celebration Against RCB IPL Chinnaswamy Stadium, Bengaluru in telugu rma

Synopsis

KL Rahul's Triumphant Celebration: బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో ఆర్సీబీపై కేఎల్ రాహుల్ 93 పరుగుల అజేయ ఇన్నింగ్స్ తో ఢిల్లీ క్యాపిటల్స్‌కు విజయాన్ని అందించాడు. గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ 'ఇది నా గ్రౌండ్, నేనే కింగ్' అంటూ సంబరాలు చేసుకున్నాడు. తనదైన స్టైల్లో ఆర్సీబీ ఫ్రాంచైజీకి షాక్ ఇచ్చాడు. 

KL Rahul's Triumphant Celebration Against RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2025) లో టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ దంచికొడుతున్నాడు. అద్భుతమైన ఆటతో ప్రత్యర్థి జట్లకు దడపుట్టిస్తున్నాడు. ఈ క్రమంలోనే బెంగళూరులోని ఏం. చిన్నస్వామి గ్రౌండ్ లో గురువారం కేఎల్ రాహుల్ హవా నడిచింది. ఆర్సీబీపై ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు సునాయాసంగా గెలుపు అందించడంలో కేఎల్ రాహుల్ ఆడిన అజేయమైన 93 పరుగుల ఇన్నింగ్స్ కీలకం అయింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కేఎల్ రాహుల్ చేసిన సెలెబ్రేషన్ ఆర్సీబీ ఫ్రాంచైజీ యజమానులకు షాక్ ఇచ్చేలా చేసింది.

కేఎల్ రాహుల్ చిన్నస్వామి స్టేడియంలో 9 ఏళ్ల తర్వాత ఐపీఎల్‌లో అర్ధ సెంచరీ చేశాడు. సిక్సర్ తో గెలుపు షాట్ కొట్టడం ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన కేఎల్ రాహుల్, ఆర్సీబీ అభిమానులు, ఫ్రాంచైజీ యజమానులను టార్గెట్ చేస్తూ ఎమోషనల్‌గా సంబరాలు చేసుకున్నాడు. గెలుపు రన్ కొట్టిన వెంటనే బ్యాట్‌తో మైదానంలో సర్కిల్ గీసి, 'ఇది నా గ్రౌండ్, ఇక్కడ నేనే కింగ్' అనేలా సైగలు చేశాడు. అలాగే, ఇది నా అడ్డా అనేకా తన బ్యాట్ తో చూపించాడు.

KL Rahul's Triumphant Celebration Against RCB IPL  Chinnaswamy Stadium, Bengaluru in telugu rma

లోక్ బాయ్ అయిన కేఎల్ రాహుల్ లక్నో టీమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆర్సీబీ జట్టు తరఫున ఆడాలని కోరికలను వ్యక్తిం చేశాడు కానీ, ఐపీఎల్ 2025 మెగా వేలంలో ఆర్సీబీ కేఎల్ రాహుల్ పై ఆసక్తి చూపించలేదు. దీతో తనను ఎంపిక చేయని ఆర్సీబీ ఫ్రాంచైజీపై కేఎల్ రాహుల్ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన తోటి ఆటగాడికి గెలుపు కరచాలనం చేసే ముందు ఛాతీని తాకుతూ 'ఇట్స్ మై గ్రౌండ్..' అని చెప్పడం కూడా కనిపించింది. హోం గ్రౌండ్ టీమ్ స్టార్ ప్లేయర్ ను జట్టులోకి తీసుకోకపోతే ఎలా ఉంటుందో తన బ్యాట్ పవర్ తో చూపించాడు కేఎల్ రాహుల్. అతని సూపర్ నాక్ తో పాటు గెలుపు తర్వాత చేసుకున్న సంబరాలు వైరల్ గా మారాయి. 


కేఎల్ రాహుల్ గతంలో ఆర్సీబీ జట్టులో ఉన్నాడు. ఈసారి ఐపీఎల్ వేలానికి ముందు ఆర్సీబీ జట్టుకు మంచి వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అవసరం ఉంది. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా చాలా ఇంటర్వ్యూలలో మళ్లీ ఆర్సీబీ తరఫున, చిన్నస్వామి మైదానంలో తన వాళ్ల కోసం ఆడటం సంతోషంగా ఉంటుందని చెప్పాడు.

KL Rahul's Triumphant Celebration Against RCB IPL  Chinnaswamy Stadium, Bengaluru in telugu rma

 

ఈ కారణంతో ఆర్సీబీ జట్టు కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేసుకోవచ్చని అభిమానులు అనుకున్నారు. గత ఐపీఎల్‌లో లక్నో జట్టు కెప్టెన్‌గా ఉన్న రాహుల్‌ను అక్కడి ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంకా చూసుకున్న తీరుకు అభిమానులు బాధపడ్డారు. వేలంలో ఏ ఆటగాడి కంటే ఆర్సీబీ అభిమానులకు కేఎల్ రాహుల్ జట్టులోకి రావాలని ఎక్కువ ఆశ ఉండేది. కానీ వేలం టేబుల్‌పై రాహుల్‌కు ఎక్కువగా బిడ్ చేయడానికి ఆర్సీబీ ఫ్రాంచైజీ నిర్ణయించుకోలేదు. చివరికి భారీ మొత్తానికి అతను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు వెళ్ళాడు.

ఛేజింగ్ సమయంలో అద్భుతమైన ఆటతో కేఎల్ రాహుల్ ఢిల్లీ సూపర్ విక్టరీ అందించాడు. కీలకమైన వికెట్లు కోల్పోయిన సమయంలో క్రీజులోకి వచ్చిన అతను మరో వైపు వికెట్లు పడుతూ కావాల్సిన రన్ రేట్ పెరుగుతుంటూ ఒత్తిడికి గురికాకుండా అద్భుతమైన ఇన్నింగ్స్ ను ఆడాడు. యష్ దయాల్ వేసిన ఓవర్ మూడో బంతికి స్ట్రైక్ తీసుకున్న రాహుల్, స్క్వేర్ లెగ్ బౌండరీలో సూపర్ సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి రివర్స్ స్వీప్ ద్వారా బౌండరీ కొట్టాడు. దీంతో తర్వాతి బంతికి యష్ దయాల్ షార్ట్ బాల్ వేయడానికి ప్రయత్నించాడు. అది రాహుల్ తల మీదుగా వెళ్లిపోయింది. వికెట్ కీపర్‌కు కూడా అందకపోవడంతో అంపైర్ వైడ్ తో పాటు ఫోర్ ఇచ్చాడు. ఆర్సీబీ దీనిని రివ్యూ చేసినా ఫలితం లేకపోయింది. స్కోర్ సమం అయిన సమయంలో యష్ దయాల్ ఐదో బంతిని మళ్లీ వేసినప్పుడు అది ఫుల్‌టాస్ అయింది. డౌన్ లెగ్‌లో వచ్చిన బంతిని లాంగ్ లెగ్ బౌండరీలో సిక్సర్‌గా కొట్టి రాహుల్ ఢిల్లీకి విజయాన్ని అందించారు. ఇక్కడ నేనే కింగ్ అంటూ సెలబ్రేషన్ చేసుకున్నాడు.

 

Download App

Latest Videos