Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs KKR: ధోని కెప్టెన్సీ కూడా ఓటమిని ఆపలేదు.. కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడిన సీఎస్కే

CSK vs KKR: ధోని కెప్టెన్సీ కూడా ఓటమిని ఆపలేదు.. కేకేఆర్ చేతిలో చిత్తుగా ఓడిన సీఎస్కే

CSK vs KKR IPL 2025: ఐపీఎల్ 2025లో క్రికెట్ లెజెండ్ ఎంఎస్ ధోని కెప్టెన్ గా తిరిగివ‌చ్చినా చేపాక్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ హ్యాట్రిక్ పరాజయాలకు అడ్డుక‌ట్ట వేయ‌లేక‌పోయాడు. కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో సీఎస్కే చిత్తుగా ఓడిపోయింది.   

Mahesh Rajamoni | Published : Apr 11 2025, 11:19 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

CSK vs KKR IPL 2025: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ చెత్త ఆట కొన‌సాగుతూనే ఉంది. ఐపీఎల్ లో మ‌రోసారి చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్  2025 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు త‌ల‌ప‌డ్డాయి.

ఈ మ్యాచ్ లో ఏ స‌మ‌యంలోనూ ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ టీ20 క్రికెట్ ను ఆడుతున్న‌ట్టుగా క‌నిపించ‌లేదు. మ‌రోసారి చెత్త బ్యాటింగ్ తో 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 103/9 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈజీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కేవలం 10.1 ఓవ‌ర్ లోనే 107/2 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. 

24
CSK vs KKR

CSK vs KKR

ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీమ్ పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఎందుకంటే ధోని కెప్టెన్ గా తిరిగొచ్చాడు. ఐపీఎల్ లో విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా ఉన్న ధోని చెన్నై టీమ్ ను మ‌ళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి తీసుకువ‌స్తాడ‌ని భావించారు కానీ, అలాంటిదేమీ జ‌ర‌గ‌లేదు. 

చెన్నై సూప‌ర్ కింగ్స్ బ్యాట‌ర్లు టీ20 ఆడుతున్నామ‌నే విష‌యాన్ని మ‌ర్చిపోయిన‌ట్టుగా త‌మ జిడ్డు బ్యాటింగ్ ను కొన‌సాగించారు. ప‌వ‌ర్ ప్లే లో 2 వికెట్లు కోల్పోయి 31 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. సీఎస్కే 79 ప‌రుగుల‌కే 9 వికెట్లు కోల్పోయింది. చెన్నై బ్యాట‌ర్ల‌లో ఏ ఒక్క‌రు కూడా పెద్ద ఇన్నింగ్స్ ల‌ను ఆడ‌లేక‌పోయారు. విజ‌య్ శంక‌ర్ మ‌రోసారి జిడ్డు బ్యాటింగ్ చేస్తూ 29 ప‌రుగులు చేశాడు. శివం దూబే 31 ప‌రుగుల‌తో నాటౌట్ గా నిలిచాడు. దీంతో సీఎస్కే 20 ఓవ‌ర్లలో 103-9 ప‌రుగులు చేసింది. 

కేకేఆర్ బౌలింగ్ అద్భుతంగా ఉంది. సునీల్ నరైన్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 2 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు తీసుకుని చెన్నై సూప‌ర్ కింగ్స్ ను దెబ్బ‌కొట్టారు. 

34
MS Dhoni

MS Dhoni

ఈజీ టార్గెట్ తో సెకండ్ బ్యాటింగ్ చేసిన కేకేఆర్ కు సునీల్ న‌రైన్ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ముందు బౌలింగ్ లో అద‌ర‌గొట్టిన న‌రైన్.. బ్యాటింగ్ లో కూడా దుమ్మురేపాడు. సునీల్ న‌రైన్ కేవ‌లం 18 బంతుల్లో 44 పరుగుల తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అత‌ని ఇన్నింగ్స్ లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. అతను ఈ ఇన్నింగ్స్‌ను 244 పరుగుల స్ట్రైక్ రేట్‌తో ఆడాడు. 

 

44
CSK vs KKR

CSK vs KKR

అలాగే, కేకేఆర్ మ‌రో ఓపెనర్ క్వింటన్ డి కాక్ 23 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడాడు. కెప్టెన్ అజింక్య రహానే (20 పరుగులు*), రింకు సింగ్ (15 పరుగులు*)లు క్రీజులో ఉండి కేకేఆర్ కు విజ‌యాన్ని అందించారు. రింకూ సింగ్ సిక్స‌ర్ తో మ్యాచ్ విన్నింగ్ ప‌రుగులు చేశాడు. బౌలింగ్, బ్యాటింగ్ అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేసిన సునీల్ న‌రైన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

ఈ గెలుపుతో కేకేఆర్ ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో 6 పాయంట్లతో 3వ స్థానంలోకి చేరింది. చెన్నై సూపర్ కింగ్ 2 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది. హైదరాబాద్ టీమ్ చివరి స్థానంలో ఉండగా, మొదటి రెండు స్థానాల్లో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఉన్నాయి.  

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఎం.ఎస్. ధోని
 
Recommended Stories
Top Stories