MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tech News
  • Google Photos: ఫోన్‌లో దిగిన ఫొటోలకు సినిమాటిక్‌ లుక్‌.. గూగుల్ ఫొటోస్‌లో ఈ ఫీచర్లు తెలుసా?

Google Photos: ఫోన్‌లో దిగిన ఫొటోలకు సినిమాటిక్‌ లుక్‌.. గూగుల్ ఫొటోస్‌లో ఈ ఫీచర్లు తెలుసా?

ప్రస్తుతం ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటోంది. అందులోనూ కెమెరాకు అధిక ప్రాధాన్యత ఉన్న ఫోన్‌లను ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. ప్రతీ చిన్న సందర్భాన్ని ఫొటోలో బంధించి వెంటనే సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసుకుంటున్నారు. ఇందుకోసం ఫొటోలను ప్రత్యేకంగా ఎడిట్‌ కూడా చేస్తుంటారు. అయితే గూగుల్‌ ఫొటోస్‌లో ప్రత్యేకంగా కొన్ని ఎడిటింగ్ ఫీచర్లు ఉన్నాయని మీకు తెలుసా.? 
 

Narender Vaitla | Published : Apr 11 2025, 04:28 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Google Photos

Google Photos

ఫోన్‌ కెమెరాలో దిగిన ఫొటోలను ఎడిటింగ్ చేసుకోవడం సర్వసాధారణమైన విషయం. ఇందుకోసం రకరకాల యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటారు. లేదంటే ఫొటో ఎడిటింగ్ వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి ఎడిట్‌ చేసుకుంటుంటారు. అయితే అలాంటివేం లేకుండా మీ ఫోన్‌లో ఉండే గూగుల్‌ ఫొటోస్‌ యాప్స్‌లో కూడా ఫొటోలను ఎడిట్‌ చేసుకోవచ్చని మీకు తెలుసా.? ఇంతకీ గూగుల్ ఫొటోస్‌లో ఉన్న ఆ ఎడిటింగ్‌ ఫీచర్లు ఏంటి.? వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

24
Asianet Image

సినిమాటిక్‌ లుక్‌ కోసం: 

* ఇందుకోసం ముందుగా మన ఫోన్‌లోని గూగుల్‌ ఫొటోస్‌ యాప్‌ను ఓపెన్‌ చేయాలి.

* ఆ తర్వాత పైన కనిపించే '+'ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత కింద కనిపించే 'సినిమాటిక్‌ ఫొటో' ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

* అనంతరం మీకు నచ్చిన ఫొటోను సెలక్ట్‌ చేసుకుంటే వెంటనే మీ ఫొటోకు సినిమాటిక్‌ లుక్‌ వచ్చేస్తుంది. దీన్ని మీరు ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌ స్టేటస్‌, ఫేస్‌బుక్‌ ఇలా నచ్చిన వాటిలో షేర్‌ చేసుకోవచ్చు. 
 

34
Asianet Image

బ్యాగ్రౌండ్ బ్లర్‌ చేసుకోవడానికి: 

* ఇందుకోసం ముందుగా గూగుల్ ఫొటోస్‌లో ఏదైనా ఒక ఫొటోను సెలక్ట్‌ చేసుకోవాలి. 

* కింద కనిపించే ఆప్షన్స్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ను నొక్కితే టూల్స్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. 

* అందులో కనిపించే 'బ్లర్‌' అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. వెంటనే బ్యాగ్రౌండ్‌ బ్లర్‌ అవుతుంది. డీఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాలో దిగిన లుక్‌ వస్తుంది. 

44
Asianet Image

అవసరం లేని వాటిని తొలగించుకోవడానికి: 

* ఫొటోల్లో మనకు అవసరం లేని కొన్ని వస్తువులు ఉంటాయి. వాటిని తొలగించుకునేందుకు కూడా ఒక ఆప్షన్‌ ఉంది. 

* ఫొటోను సెలక్ట్‌ చేసుకున్న తర్వాత మ్యాజిక్‌ ఎరేజర్‌ అనే ఫీచర్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

* మీరు దిగిన ఫొటోలో ఇతరులు ఉన్నా, అనవసరమైన వస్తువులు ఉన్నా వాటిని సర్కిల్‌ చేస్తే డిలీట్‌ అవుతాయి. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
 
Recommended Stories
Top Stories