- Home
- Telangana
- School Holidays : వచ్చేవారం ఎనిమిదిరోజుల్లో మూడ్రోజులే స్కూళ్లు నడిచేది... ఏప్రిల్ 13,14,18,19,20 సెలవులే
School Holidays : వచ్చేవారం ఎనిమిదిరోజుల్లో మూడ్రోజులే స్కూళ్లు నడిచేది... ఏప్రిల్ 13,14,18,19,20 సెలవులే
ఏప్రిల్ 2025 లో ఇప్పటికే వరుస సెలవులు వచ్చాయి. ఇకపై కూడా మరిన్ని సెలవులు వస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చేవారం ఎనిమిదిరోజుల్లో కేవలం మూడ్రోజులు మాత్రమే పూర్తిగా అన్నిస్కూళ్లు నడుస్తాయి. మిగతారోజుల్లో సెలవులే సెలవులు. ఏరోజు ఎందుకు సెలవు ఉందో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
School Holidays
School Holiday : ఈ నెల ఆరంభమే సెలవుతో జరిగింది... అందుకేనేమో ఈ ఏప్రిల్ నెలంతా సెలవులతో నిండిపోయింది. ఏప్రిల్ 1న రంజాన్ తర్వాతిరోజు తెలంగాణలో విద్యార్థులు, ఉద్యోగులకు సెలవు వచ్చింది. తర్వాత ఓ మూడ్రోజులు గడిచిందో లేదో మళ్ళీ వరుసగా రెండ్రోజులు సెలవులు వచ్చాయి. ఏప్రిల్ 5న బాబు జగజ్జీవన్ రామ్ జయంతి, ఏప్రిల్ 6న రామనవమి సందర్భంగా సెలవులు వచ్చాయి. మళ్లీ మూడ్రోజులు తర్వాత అంటే ఏప్రిల్ 10న మహవీర్ జయంతికి ఆప్షనల్ హాలిడే వచ్చింది. ఇవాళ(శుక్రవారం) అంటే ఏప్రిల్ 11న వర్కింగ్ డే కాగా మళ్లీ వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి.
ఏప్రిల్ 12 రెండో శనివారం, ఏప్రిల్ 13 ఆదివారం సాధారణ సెలవులే. ఇక ఏప్రిల్ 14 సోమవారం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సెలవు వుంది. ఇలా తెలంగాణలోనే కాదు ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో చదివే విద్యార్థులకు వరుస సెలవులు వచ్చాయి. ఉద్యోగులకు కూడా ఈ మూడ్రోజులు సెలవే.
అయితే ఈ సెలవులు ఇలా ముగుస్తాయో లేదో మరో లాంగ్ వీకెండ్ రెడీగా ఉంది. అంటే ఈవారంలో మాదిరిగానే వచ్చేవారం కూడా భారీగా సెలవులున్నాయి. ఇలా వచ్చేవారం స్కూళ్ళు నడిచేది ఎన్నిరోజులు, సెలవులు ఎన్నిరోజులో ఇక్కడ తెలుసుకుందాం.
school holidays
వచ్చేవారం సెలవులెన్ని?
తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశవ్యాప్తంగా చాలారాష్ట్రాల్లో ఏప్రిల్ 14న సెలవు ఉంది. ఈరోజు సోమవారం... అంటే వచ్చేవారం సెలవుతోనే ప్రారంభం అవుతోంది. తర్వాత మూడు రోజులు ఏప్రిల్ 15, 16,17 మాత్రమే విద్యాసంస్థలు నడిచేది. తర్వాత మళ్ళీ వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి.
ఏప్రిల్ 18 అంటే వచ్చే శుక్రవారం క్రైస్తవులు ఎంతో పవిత్రంగా భావించే గుడ్ ప్రైడ్. ఈరోజునే వారి ఆరాధ్యదైవం యేసుక్రీస్తు శిలువపై మరణించాడని నమ్ముతారు. అందువల్ల సంతాపదినంగా ఈ గుడ్ ప్రైడే జరుపుకుంటారు... దేశవ్యాప్తంగా అన్ని చర్చిల్లోనూ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కాబట్టి ఈరోజు తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో విద్యాసంస్థలు, ఉద్యోగులకు సెలవు ప్రకటించారు.
తర్వాతిరోజు ఏప్రిల్ 19 శనివారం. ఆరోజు కొన్ని ప్రైవేట్ విద్యాసంస్థలకు సాధారణ సెలవు ఉంటుంది. అలాగే కార్పోరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా సాధారణంగా శనివారం సెలవురోజే. ఇలా అందరికి కాకపోయినా కొంతమంది విద్యార్థులు, ఉద్యోగులకు శనివారం సెలవు ఉంది.
ఏప్రిల్ 20 ఆదివారం అందరికీ సాధారణ సెలవు ఉంటుంది. ఇలా వచ్చేవారం కూడా వరుసగా మూడ్రోజులు సెలవు అంటే లాంగ్ వీకెండ్ వస్తోంది. ఇది పరీక్షల సమయం... కాబట్టి ఈ సెలవుల్లో విద్యార్థులు చదువుకునేందుకు మరింత సమయం దొరుకుతుంది. ఉద్యోగులు మాత్రం ఈ లాంగ్ వీకెండ్ ను బాగా ఎంజాయ్ చేయవచ్చు... కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి అరకు, ఊటీ లాంటి చల్లని ప్రదేశానికి టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
School Holidays
వేసవి సెలవులు ఎప్పట్నుంచంటే :
ఏప్రిల్ 21న సోమవారం స్కూళ్ళు ప్రారంభమై ఓ మూడ్రోజులు నడుస్తాయో లేదో వేసవి సెలవులు షురూ అవుతాయి. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఏప్రిల్ 24నుండి వేసవి సెలవులని ప్రకటించింది... ఏపీలో కూడా ఏప్రిల్ 24నుండే వేసవి సెలవులు ప్రారంభం అవుతాయి. మే మొత్తం సెలవులతోనే గడిచిపోతుంది... జూన్ 12న తిరిగి విద్యాసంస్థలు పున:ప్రారంభం అవుతాయి.
వేసవి సెలవుల్లో విద్యాసంస్థలు క్లాసులు నిర్వహించకూడదని ... అలా చేసినట్లు తెలిస్తే కఠిన చర్యలుంటాయని విద్యాశాఖ అధికారులు హెచ్చరించారు. ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికే పరీక్షలు ముగిసి వేసవి సెలవులు కొనసాగుతున్నాయి... వారికి కూడా వేసవి సెలవుల్లో నీట్, ఎంసెట్, జెఈఈ అంటూ క్లాసులు నిర్వహించకూడదని ఇంటర్మీడియట్ బోర్డ్ హెచ్చరించింది. విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడేలా మండుటెండల వేళ క్లాసుల నిర్వహణ తగదని ... విద్యాసంస్థలు ఇందుకు సహకరించాలని సూచించారు. ఇంటర్ విద్యార్థులకు మాత్రం జూన్ మొదటివారంలోనే స్కూళ్లు ప్రారంభంకానున్నాయి.