MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • Home
  • Business
  • Drink: వోడ్కా లవర్స్‌కి నోరూరాల్సిందే.. స్పైట్‌, వాటర్‌మిలాన్‌ ఫ్లేవర్‌తో కొత్త డ్రింక్‌.

Drink: వోడ్కా లవర్స్‌కి నోరూరాల్సిందే.. స్పైట్‌, వాటర్‌మిలాన్‌ ఫ్లేవర్‌తో కొత్త డ్రింక్‌.

మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకొని నిలబడాలంటే వినూత్నంగా ఆలోచించాలి అప్పుడే సక్సెస్‌ అవుతారు. ఇది అందరికీ తెలిసిందే. అందుకే కంపెనీలు వినియోగదారులను ఆకర్షించే క్రమంలో సరికొత్త ఎత్తుగడలు వేస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ కూల్‌క్రింక్స్‌ సంస్థ కొకాకోలా సరికొత్త ప్రొడక్ట్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఇంతకీ ఏంటా ప్రొడక్ట్‌.? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Narender Vaitla | Published : Apr 11 2025, 12:22 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Vodka Sprite

Vodka Sprite

ఆల్కహాల్‌ ప్రియులు ఎంతో ఇష్టంగా తీసుకునే డ్రింక్‌లో వోడ్కా ఒకటి. మార్కెట్లో ఇప్పటికే వోడ్కాను పలు ఫ్లేవర్స్‌లో తీసుకొచ్చారు. అయితే తాజాగా సరికొత్త ఫ్లెవర్‌ను లాంచ్‌ చేశారు. ప్రస్తుతం యూకేలో అందుబాటులోకి వచ్చిన ఈ డ్రింక్‌ త్వరలోనే ప్రపంచమంతా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కొకా కోలా యూరోపాసిఫిక్‌ పార్టనర్స్‌ 'అబ్సలూట్‌ వోడ్కా అండ్‌ స్ప్రైట్‌ వాటర్‌మెలాన్‌' పేరుతో టిన్స్‌ను ప్రవేశపెట్టింది. 

23
Asianet Image

కొకా-కోలా యూరోపాసిఫిక్ పార్టనర్స్ (CCEP) తాము తయారుచేస్తున్న రెడీ టు డ్రింక్ (RTD) పానీయాల విభాగాన్ని విస్తరిస్తూ, కొత్తగా అబ్సలూట్ వోడ్కా అండ్‌ స్ప్రైట్ వాటర్‌మెలాన్ వేరియంట్‌ను విడుదల చేసింది. యూకే వ్యాప్తంగా 250 మిల్లీలీటర్ల టిన్స్‌లో లభిస్తోంది. ఇందులో స్ప్రైట్‌కు ప్రత్యేకమైన రుచికి తోడుగా అబ్సలూట్ వోడ్కా స్మూత్‌నెస్‌ ఉంటుంది. వాటర్‌మెలాన్ ఫ్లేవర్‌ను కూడా ఇందులో మిక్స్‌ చేశారు. 

ఈ కొత్త వేరియంట్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. 84% మంది వీటిని కొనుగోలు చేయాలనే ఉత్సాహాన్ని చూపించినట్లు సర్వేలో వెల్లడైంది. ఇక టిన్‌ డిజైన్‌ను కూడా చాలా ప్రత్యేకంగా చేశారు. RTD విభాగానికి అసోసియేట్ డైరెక్టర్‌గా ఉన్న ఎలైన్ మహర్ మాట్లాడుతూ.. 'ఈ ఏడాది మేము RTD విభాగంలో కొత్తదనం వైపు అడుగులు వేస్తున్నాం. వాటర్‌మెలాన్ వేరియంట్‌ను పరిచయం చేయడం ఒక గేమ్‌ చేంజర్‌. ఇది కేవలం అబ్సలూట్ వోడ్కా అండ్‌ స్ప్రైట్‌కే కాదు, మొత్తం కేటగిరీకే కొత్త ఊపును ఇస్తుంది' అని చెప్పుకొచ్చారు. 
 

33
vodka sprite

vodka sprite

ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'వోడ్కా నుంచి ఇప్పటికే వచ్చిన రడీ టూ డ్రింక్స్‌కి ప్రాధానత్య ఉంది. లెమన్‌ లైమ్‌ మిక్సర్‌ స్పైట్‌కు మంచి ప్రజాదరణ లభించింది. ఇప్పుడు వాటర్‌మెలాన్ వంటి ఫ్రూటీ ఫ్లేవర్‌ చేర్చటం వల్ల మేము ‘ఫ్లేవర్ ఇన్నొవేషన్’ అనే విభాగంలో ముందంజలో ఉన్నాం" అన్నారు. ఫ్రెండ్స్‌తో కలిసి సమ్మర్‌లో ఆనందంగా గడపడానికి, ఫెస్టివల్స్‌ నుంచి చిల్‌నైట్స్ వరకూ.. అబ్సలూట్ వోడ్కా అండ్‌ స్ప్రైట్‌ను కొత్తగా ఆస్వాదించేందుకు ఇది సరైన ఎంపిక" అని ఆమె చెప్పుకొచ్చారు. 

Narender Vaitla
About the Author
Narender Vaitla
నరేందర్ వైట్లకు ప్రింట్‌, డిజిటల్ మీడియాలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రస్తుతం ఏసియా నెట్ న్యూస్ తెలుగులో సీనియర్ సబ్ ఎడిటర్‌గా సేవందిస్తున్నారు. 2015లో సాక్షి దినపత్రిక ద్వారా జర్నలిజంలోకి అడుగుపెట్టారు. అనంతరం 2019లో ఈనాడు డిజిటల్‌ విభాగంలో సబ్‌ ఎడిటర్‌గా, 2020లో టీవీ9 తెలుగులో (డిజిటల్‌) సీనియర్‌ సబ్‌ ఎడిటర్‌గా పని చేశారు. లైఫ్‌స్టైల్‌, టెక్నాలజీ, హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వంటి తదితర విభాగాలకు చెందిన వార్తలు రాస్తుంటారు. Read More...
జీవనశైలి
ఆహారం
 
Recommended Stories
Top Stories