MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Life
  • Health
  • Brain: ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీ మెదడుకు చాలా డేంజర్

Brain: ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీ మెదడుకు చాలా డేంజర్

Brain: మానవ శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం. ఇది స్ట్రాంగ్ గా , షార్ప్ గా ఉంటేనే ఏ పనైనా చేయగలం. కానీ మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆ పొరపాట్లు, వాటిని చేయకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 11 2025, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

అసలు మనిషి అనారోగ్యానికి కారణం మెదడు. ఎందుకంటే మెదడు నుంచి వచ్చే సంకేతాల ఆధారంగా శరీరంలోని అన్ని అవయవాలు పనిచేస్తాయి. మెదడు పని పేరు సరిగ్గా లేకపోతే ఆ ప్రభావం శరీరంలోని ఇతర అవయవాలపై పడుతుంది. బ్రెయిన్ ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకుంటే సరిపోతుందని చాలామంది అనుకుంటారు. కానీ మనకు తెలియకుండా చేసే కొన్ని పొరపాట్ల వల్ల బ్రెయిన్ దెబ్బతింటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మీరు ఎక్కువ సౌండ్, హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటారా? ఇలా తరచూ చేయడం వల్ల భవిష్యత్తులో మీ మెదడు తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. వినికిడి సమస్య వస్తుంది. గంటల తరబడి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వినడం మంచిది కాదు అని డాక్టర్లు సూచిస్తున్నారు. 

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కూడా బ్రెయిన్ దెబ్బ తింటుంది. అల్జీమర్స్ వంటి మెదడు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. 
 

35

చాలామంది రాత్రి ఎక్కువసేపు పడుకోరు. పార్టీలు, ట్రావెలింగ్, ఆఫీస్ పనులంటూ రాత్రిపూట కేవలం రెండు, మూడు గంటలే నిద్రపోతారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి, లాజికల్ థింకింగ్ తగ్గుతుందని, సమస్యలు పరిష్కరించే గుణం కూడా పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇది కూడా చదవండి ఎక్సర్‌సైజ్ చేసిన తర్వాత ఇవి అస్సలు తినకూడదు

45

ఆఫీసుల్లో గంటల తరబడి కూర్చుని పని చేయడం వల్ల మెదడు పనితీరు తగ్గిపోతుంది. ఎక్కువసేపు కూర్చుని ఉండడం వల్ల మెదడుకు సరిగ్గా రక్తప్రసరణ ఉండదు. అందుకే మధ్య మధ్యలో కొంచెం సేపు నడవాలి.

చాలామంది ఉదయం టిఫిన్ చేయడం మానేస్తారు. పని ఒత్తిడిలో పడి డైరెక్టుగా భోజనం చేస్తుంటారు. ఇది కూడా మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. నిద్రలేచిన వెంటనే ఎక్కువ నాణ్యమైన ఆహారం తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. 
 

55

వేసవికాలం కాబట్టి త్వరగా డీహైడ్రేషన్ కి గురవుతుంటాం. ఇది కూడా మెదడు పనితీరును ప్రభావితం చేస్తుంది. అందుకే వేసవిలో సాధారణంగా తాగే నీరు కంటే కొంచెం ఎక్కువ నీరు తాగాలి.
 

ఇది కూడా చదవండి స్నానం ముందు నీళ్లు తాగితే బీపీ కంట్రోల్ అవుతుందా? ఇందులో నిజమెంత?

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
జీవనశైలి
ఆరోగ్యం
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved