MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tips
  • Reels: రీల్స్‌ స్క్రోల్‌ చేసి చేసి వేళ్లు నొప్పులు పుడుతున్నాయా? ఫోన్‌ టచ్‌ చేయకుండా వాయిస్ కమాండ్‌తో చూడొచ్చు

Reels: రీల్స్‌ స్క్రోల్‌ చేసి చేసి వేళ్లు నొప్పులు పుడుతున్నాయా? ఫోన్‌ టచ్‌ చేయకుండా వాయిస్ కమాండ్‌తో చూడొచ్చు

స్మార్ట్‌ ఫోన్‌ ఉపయోగించే ప్రతీ ఒక్కరూ రీల్స్‌ చూస్తారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా యువత రీల్స్‌కు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. ఒక రీల్ చూద్దామని మొదలు పెట్టి గంటల తరబడి చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే స్క్రీన్‌ స్క్రోల్‌ చేసి చేసి వేళ్లు నొప్పి పుడుతుంటాయి. అయితే ఇలా స్క్రోల్‌ చేయకుండా వాయిస్‌ కమాండ్‌తో రీల్స్‌ను ఆపరేట్‌ చేసుకుంటే భలే ఉంటుంది కదూ!  

2 Min read
Author : Narender Vaitla| AFP
Published : Apr 11 2025, 05:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Watching Reels

Watching Reels

స్మార్ట్‌ ఫోన్‌లో మనకు తెలియని ఎన్నో హిడెన్‌ ఫీచర్స్‌ ఉంటాయి. వీటితో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. అలాంటి ఒక క్రేజీ ఫీచర్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇన్‌స్టా లేదా ఫేస్‌బుక్‌లో రీల్స్‌ చూసే అలవాటు మనలో చాలా మందికి ఉండే ఉంటుంది. అయితే ఇలా గంటల తరబడి రీల్స్‌ చూడడం ద్వారా వేళ్లు నొప్పి పెడుతుంటాయి. అలా కాకుండా జస్ట్‌ మన వాయిస్‌ కంట్రోల్‌తో రీల్స్‌ను స్క్రోల్‌ చేస్తే ఎలా ఉంటుంది.? వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్‌గా వర్కవుట్‌ కాదని అనుకుంటున్నారా.? అయితే ఐఫోన్‌లో ఓ ఉన్న ఫీచర్‌ను ఎనేబుల్ చేసుకుంటే ఈ అవకాశాన్ని పొందొచ్చు. అదెలాగో స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇప్పుడు తెలుసుకుందాం. 

24
iphone

iphone

* ఇందుకోసం ముందుగా మీ ఫోన్‌లో సెట్టింగ్ ఆప్షన్స్‌లోకి వెళ్లాలి. 

* అనంతరం యాక్సెసబులిటీ ఆప్షన్‌లోకి వెళ్లాలి. ఆ తర్వాత అందులో కనిపించే వాయిస్‌ కంట్రోల్‌ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. 

* అందులోకి వెళ్లి 'వాయిస్‌ కంట్రోల్‌' ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకోవాలి. 
 

34

* ఆ తర్వాత కింద కనిపించే కమాండ్స్‌ ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. అందులోకి వెళ్లిన తర్వాత 'క్రియేట్‌ న్యూ కమాండ్‌' అనే ఆప్షన్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 

* మీకు నచ్చిన పేరుతో ఒక కమాండ్‌ను క్రియేట్‌ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు తర్వాత రీల్‌ చూడడానికి 'Next' అనే కమాండ్ ఇవ్వాలనుకున్నారని అనుకుందాం. 

* Next పేరుతో కమాండ్ క్రియేట్ చేసి కింద కనిపించే యాక్షన్‌ బటన్‌ను నొక్కాలి. అందులో రన్‌ కస్టమ్‌ టెక్చర్‌ను సెలక్ట్‌ చేసుకోవాలి. 
 

44
Smart Phone

Smart Phone

* ఇక్కడ మనం రీల్స్‌ చూసే సమయంలో స్వైప్‌ చేసే విధంగా స్క్రీన్‌పై స్వైప్‌ చేసి సేవ్‌ చేయాలి. 

* అనంతరం బ్యాక్‌ వచ్చి కమాండ్‌ను సేవ్‌ చేసుకోవాలి. 

* ఇలా కమాండ్‌ సేవ్‌ చేసుకున్న తర్వాత రీల్స్‌ ఓపెన్‌ చేసి 'Next' అని చెప్పిన ప్రతీసారి తర్వాతి రీల్‌ ఆటోమెటిక్‌గా వచ్చేస్తుంది. ఇలా ఫోన్‌ను టచ్‌ చేయకుండానే రీల్స్‌ను చూడొచ్చన్నమాట. మరెందుకు ఆలస్యం మీరు కూడా ఐఫోన్‌ ఉపయోగిస్తుంటే వెంటనే ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేసేసుకోండి. 
 

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు

Latest Videos
Recommended Stories
Recommended image1
Bluetooth vs Wired Earphones.. వీటిలో ఏది బెటర్? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Recommended image2
వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్
Recommended image3
నాన్ స్టిక్ పాత్రను ఎంతకాలం వాడొచ్చు? వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved