MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • CSK vs KKR: 1 పరుగుకే.. సీఎస్కే కెప్టెన్ ధోని చెత్త రికార్డు

CSK vs KKR: 1 పరుగుకే.. సీఎస్కే కెప్టెన్ ధోని చెత్త రికార్డు

CSK vs KKR IPL 2025: ఐపీఎల్ 2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ (సీఎస్కే) చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఓట‌ములు చూస్తూనే ఉంది. మ‌రోసారి త‌న సొంత గ్రౌండ్ లోనే చిత్తుగా ఓడిపోయింది. ఎంఎస్ ధోని కెప్టెన్ గా తిరిగివ‌చ్చినా చేపాక్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ హ్యాట్రిక్ ఓట‌మి నుంచి త‌ప్పించుకోలేక‌పోయింది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 11 2025, 11:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

CSK vs KKR IPL 2025: ఇండియ‌న్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌రోసారి చెత్త ప్ర‌ద‌ర్శ‌న‌తో చిత్తుగా ఓడిపోయింది. ఐపీఎల్  2025 25వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్ లో ఏ స‌మ‌యంలోనూ ఎంఎస్ ధోని కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్ అజింక్యా ర‌హానే కెప్టెన్సీలోని కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ (కేకేఆర్) కు పోటీని ఇవ్వ‌లేక‌పోయింది. బ్యాటింగ్, బౌలింగ్ లో విఫ‌ల‌మై చిత్తుగా ఓడిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

ఈ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై టీమ్ చెత్త బ్యాటింగ్ ప్ర‌ద‌ర్శ‌న చేసింది. 20 ఓవ‌ర్లు ముగిసే స‌రికి 103/9 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. ఈజీ టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన కేకేఆర్ కేవలం 10.1 ఓవ‌ర్ లోనే 107/2 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది.

35
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

ఈ ఓట‌మితో చెన్నై టీమ్ ఐపీఎల్ 2025 లో చెత్త రికార్డుల‌ను న‌మోదుచేసింది. ఐపీఎల్ 2025లో సీఎస్కే ఆడిన 6 మ్యాచ్ ల‌లో 5 ఓడిపోయింది. రుతురాజ్ గైక్వాడ్ తర్వాత ఎంఎస్ ధోని కెప్టెన్సీ కూడా చెన్నై టీమ్ కు విజ‌యాన్ని అందించ‌లేక‌పోయింది. చెన్నై జట్టు కేకేఆర్ చేతిలో 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో, ఐపీఎల్‌లో ధోని కెప్టెన్సీ కూడా చెత్త రికార్డును న‌మోదుచేసింది. చెపాక్‌లో అవమానకరమైన రికార్డు సృష్టించింది. 

45
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

ధోని కెప్టెన్సీలో చెపాక్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టింది సీఎస్కే. మొద‌ట బ్యాటింగ్ చేసిన సీఎస్కే టీమ్ బ్యాట‌ర్లు ఘోరంగా విఫ‌ల‌మ‌య్యారు. శివం దూబే 31, విజయ్ శంకర్ 29 పరుగులు చేయడంతో జట్టు స్కోరు 9 వికెట్లు కోల్పోయి 103 పరుగులకు చేరుకుంది. కేకేఆర్ ఈజీగానే టార్గెట్ ను అందుకుంది. దీంతో చెపాక్‌లో ధోని కెప్టెన్సీపై మ‌చ్చ ప‌డింది. చెపాక్‌లో సీఎస్కే వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. కేకేఆర్ కు ముందు ఆర్సీబీ, డీసీ జ‌ట్లు కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను హోం గ్రౌండ్ లో ఓడించాయి. 

55
CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

CSK captain MS Dhoni's worst record in ipl history in Chepauk

చెపాక్‌లో సీఎస్కే ఇంత తక్కువ స్కోరు చేయడం ఐపీఎల్ చరిత్రలో ఇదే మొదటిసారి. అది కూడా ధోని కెప్టెన్సీలో కావ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం. అలాగే, చెపాక్ గ్రౌండ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ వరుసగా మూడు మ్యాచ్ లు ఓడిపోవ‌డం కూడా ఇదే మొదటిసారి.

ఈ మ్యాచ్ తో ఎంఎస్ ధోని మ‌రోసారి తీవ్రంగా నిరాశ‌ప‌రిచాడు. అత‌ని నుంచి మంచి ఇన్నింగ్స్ ను ఆశించిన క్రికెట్ అభిమానుల గుండెల‌ను బ‌ద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్ లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి మహీ పెవిలియన్ కు చేరాడు. ధోని ఆడ‌టానికి చాలా ఓవ‌ర్లు ఉన్నా అత‌ను ఎక్కువ సేపు క్రీజులో నిల‌బ‌డ‌లేక‌పోయాడు. సునీల్ న‌రైన్ బౌలింగ్ లో ధోని ఎల్బీడ‌బ్ల్యూగా అవుట్ అయ్యాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఎం.ఎస్. ధోని

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved