MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Toothpaste: టూత్ బ్రష్ నిండా పేస్ట్ వేసుకొని పళ్లు తోముతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Toothpaste: టూత్ బ్రష్ నిండా పేస్ట్ వేసుకొని పళ్లు తోముతున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Toothpaste: ప్రతి రోజూ బ్రష్ చేసేటప్పుడు మీ టూత్ బ్రష్ మీద ఎంత పేస్టు వేసుకుంటున్నారు? సాధారణంగా బ్రష్ నిండా పేస్టు వేసుకోవడం మనందరికీ అలవాటు కదా.. కాని దీని వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసా? ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Naga Surya Phani Kumar | Published : Apr 11 2025, 04:16 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

పళ్లు తోముకోవడం అంటే.. ఒకప్పుడు వేపపుల్లలు, జామపుల్లలు లాంటివి ఉపయోగించేవారు. వాటిలో ఉండే ఔషధ గుణాల వల్ల ఎలాంటి పళ్ల సమస్యలు వచ్చేవి కావి. 1980 దశకంలో కోల్గోట్ లాంటి కంపెనీలకు చెందిన టూత్ పౌడర్లు వాడేవారు. కాని ఇప్పుడు పుల్లలు, టూత్ పౌడర్ల స్థానంలో టూత్ పేస్టులు వచ్చేశాయి. 

టూత్ పేస్టుల్లో కూడా చాలా రకాలు వచ్చాయి. ఆయుర్వేద గుణాలు కలిగివినవి, కెమికల్స్ లో తయారు చేసినవి మార్కెట్ లో అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా రకరకాల పళ్లకు రకరకాల టూత్ పేస్టులు కూడా వచ్చేశాయి.
 

25
Asianet Image

ఎన్ని రకాల టూత్ పేస్టులు వచ్చినా బ్రష్ చేసేటప్పుడు మాత్రం అందరూ బ్రష్ నిండా పేస్టు వేసుకొని నోటి నిండా నురగ వచ్చేలా తోముకోవడం మనకు అలవాటే కదా.. కాని ఈ విధంగా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. టూత్ బ్రష్ మీద ఎంత పేస్టు వేసుకొని బ్రష్ చేయాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. 
 

35
Asianet Image

ఎక్కువ పేస్టు వేసుకొంటే పళ్లు ఎక్కువగా శుభ్రం అవుతాయని చాలా మంది అనుకుంటారు. కాని అందులో నిజం లేదు.  పెద్దవాళ్లు బఠానీ గింజ అంత మాత్రమే టూత్ పేస్టు వేసుకొని బ్రష్ చేయాలి. అదే పిల్లలైతే ఇంకా తక్కువగా వేసుకోవాలి. బఠానీ గింజలో సగం కాని, గోధుమ గింజ అంత పరిమాణంలో పేస్టు వేసుకొని పళ్ళు తోముకోవాలి. 

ఇది కూడా చదవండి ఈ అలవాట్లు మార్చుకోకపోతే మీ మెదడుకు చాలా డేంజర్

45
Asianet Image

బ్రష్ పై ఎక్కువ పేస్టు వేసుకుంటే ఏమవుతుంది

టూత్ పేస్టుల తయారీలో ఫ్లోరైడ్ వాడతారు. అందువల్ల బ్రష్ మొత్తం పేస్టు వేసుకుంటే ఫ్లోరైడ్ అధికంగా పళ్లపై పేరుకుపోతుంది. సరిగా శుభ్రం చేసుకోకపోతే దంతాలపైనే ఉండిపోతుంది. దీంతో అవి త్వరగా దెబ్బతింటాయి. దంతాలు పచ్చగా మారడం, మచ్చలు పడటం మొదలవుతాయి. ఫ్లోరోసిస్ అనే సమస్య కూడా రావచ్చు. 

55
Asianet Image

ఎక్కువ పేస్టు వేసుకోవడం వల్ల నోటిలోని చిగుళ్లు, బుగ్గలపై ప్రభావాన్ని చూపిస్తాయి. అవి ఎర్రగా మారి సెన్సిటివ్ గా అయిపోతాయి. 

ఎక్కువ పేస్టు వేసుకున్నప్పుడు ఎక్కువ నొప్పు వస్తుంది. దీంతో ఎక్కువ శుభ్రం చేసుకోకుండా త్వరగా బ్రషింగ్ పూర్తి చేసేస్తాం. దీంతో పళ్లు త్వరగా దెబ్బతింటాయి. 

పేస్టులో ఉండే రసాయనాలు కడుపులోకి వెళ్లడం వల్ల వాంతులు, జీర్ణ సమస్యలు రావచ్చు. అందుకే తక్కువ పేస్టు వేసుకొని 2 నిమిషాలు బ్రష్ చేస్తే సరిపోతుంది. 

Naga Surya Phani Kumar
About the Author
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది. Read More...
జీవనశైలి
ఆహారం
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్
 
Recommended Stories
Top Stories