MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • మీరు సహోద్యోగిని పెళ్ళాడితే ఎన్నిలాభాలో తెలుసా?

మీరు సహోద్యోగిని పెళ్ళాడితే ఎన్నిలాభాలో తెలుసా?

మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీకింకా పెళ్లికాలేదా? అయితే మీ వర్క్-లైఫ్ న్య బ్యాలన్స్ గా ఉంచుకోవాలంటే సహోద్యోగిని పెళ్లాడితే సరిపోతుందట. దీనివల్ల ఇంకా ఎన్నో లాభాలున్నాయని ఓ బెంగళూరు వ్యక్తి సూచిస్తున్నాడు. ఆ లాభాలేమిటో ఇక్కడ చూద్దాం.  

Arun Kumar P | Updated : Apr 11 2025, 05:25 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
13
Marry Your Colleague

Marry Your Colleague

ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు చేసేవారి పరిస్థితి దారుణంగా తయారవుతోంది. కొన్ని కార్పోరేట్ కంపనీల్లో అయితే మరీదారుణం... ఉద్యోగులకు ఓ వేళాపాళ అంటూ ఉండదు... 24 గంటలు పని చేయాలన్నట్లు వ్యవహరిస్తుంటారు. కానీ సాలరీ మాత్రం ఆ ఎనిమిది తొమ్మిది గంటలకే ఇస్తారు. ఇలా పని ఒత్తిడి కారణంగా ప్రొపెషనల్ లైఫ్, పర్సనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేసుకోలేకపోతున్నారు. 

సాధారణంగా ఉద్యోగులు రోజులోని 24 గంటలను 8+8+8 గా విభజించుకుంటారు.  ఇందులోని 8 గంటలు మాత్రమే ప్రొఫెషన్ వి... మిగతా సమమంతా వ్యక్తిగత జీవితానిది. 8 గంటలు నిద్రకు పోయినా ఇంకో 8 గంటలు కుటుంబంతో గడిపేందుకు కేటాయిస్తారు. కానీ ప్రస్తుతం ఉద్యోగులకు వ్యక్తిగత జీవితమన్నదే లేకుండా చేస్తున్నాయి పలు కంపనీలు... 24 గంటలు పనీ పనీ అంటూ వెంటపడుతున్నాయి. దీంతో వర్క్-లైఫ్ ను బ్యాలన్స్ చేసుకోలేక సతమతం అవుతున్నారు. 

పని ఒత్తిడితో వ్యక్తిగత జీవితం ఎలాగని మదనపడుతున్న యువతకు బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి అద్బుతమైన సలహా ఇస్తున్నాడు. బయటివాళ్లను కాదు మీ సహోద్యుగులను పెళ్ళాడితే ఏ సమస్యా ఉండదంటున్నాడు. ఇద్దరూ ఒకేచోట పనిచేయడం వల్ల అక్కడ పరిస్థితులు అర్థం చేసుకుంటారు...  కాబట్టి వ్యక్తిగత జీవితంలో విబేధాలు ఉండవంటున్నారు. అంతేకాదు భార్యాభర్తలిద్దరూ ఒకేచోట పనిచేయడంవల్ల ఇంకెన్నో లాభాలు ఉన్నాయంటున్నాడు. 

23
Marry Your Colleague

Marry Your Colleague

సహోద్యోగిని పెళ్లాడితే లాభాలివే : 

బెంగళూరుకు చెందిన హర్షిత్ మహవర్ లింక్డ్ఇన్ లో ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందో వివరించాడు. ప్రొఫెషనల్, పర్సనల్ లైఫ్ ను బ్యాలన్స్ చేయలేక చాలామంది ఇబ్బందిపడుతున్నారని పేర్కొన్నాడు. దీనికి పరిష్కారం సహోద్యోగిని పెళ్లాడటమేనని తెలిపాడు.  

అతడి పోస్టుకు నెటిజన్ల నుండి విశేష స్పందన వస్తోంది.  19 వేల మందికిపైగా ఈ పోస్టుకు రియాక్ట్ కాగా, 800 పైగా కామెంట్స్ వచ్చాయి. చాలామంది అతడి సలహా బావుందంటున్నారు... ఇంకొందరు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. సహోద్యోగిని పెళ్లాడితే వర్క్-లైఫ్  బ్యాలన్స్ అవడమే కాదు ఇతర లాభాలను వివరిస్తూ అతడు చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది. 

1. ఇద్దరూ ఒకేచోట పనిచేయడంవల్ల డబ్బులు ఆదా అవుతాయని  మహవర్ తెలిపాడు. ఒకే క్యాబ్ లో ఆఫీసుకు వెళతారు... ఒకేసారి తిరిగివస్తారు. కాబట్టి పోనురాను డబ్బులు మిగిలిపోతాయని తెలిపాడు. 

2. ఆఫీసులో పనిచేస్తున్నా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫీలింగ్ పొందవచ్చు. ఎందుకంటే వారి జీవిత భాగస్వామి కూడా అక్కడే ఉంటారు... కాబట్టి ఆఫీస్ నే ఇళ్లుగా ఫీల్ కావచ్చు. 

3. భార్యాభర్తలు ఒకేచోట పనిచేయడం వల్ల వారితో ఇతర ఉద్యోగులు జాగ్రత్తగా ఉంటారు. ఆఫీసు ప్రేమాయణాలు, ఇతర సంబంధాలు ఉండవు.  కాబట్టి ఈ జంట మధ్య విబేధాలు ఉండవు. 

4. ప్రతిరోజు ఒకేచోట కలిసుంటారు కాబట్టి ఇద్దరి మధ్య బంధం మరింత బలపడుతుంది. ఒకరిపై ఒకరికి ఎలాంటి అనుమానాలుండవు. మంచి స్నేహితుల్లా కలిసిమెలిసి ఉంటారు. 

5. ఆపీసులోని పని బోరింగ్ ఉంటే కాస్సేపు జీవిత భాగస్వామితో ముచ్చటించవచ్చు. దీంతో మైండ్ రిఫ్రెష్ అవుతుంది. తద్వారా ఇద్దరి పనిలో క్వాలిటీ పెరుగుతుంది. 

33
Marry Your Colleague

Marry Your Colleague

హర్షిత్ మహవర్ ఆసక్తికర పోస్ట్ యధావిధిగా : 

ఉద్యోగుల పరిస్థితి ఎలా తయారయ్యిందంటే... 
ఉద్యోగం చేస్తుంటే-కుటుంబంతో మాట్లాడేందుకు సమయం ఉండదు. 
ఉద్యోగం వదిలేస్తే- కుటుంబం మీతో మాట్లాడటం మానేస్తుంది. 

లూస్-లూస్ సిట్యుయేషన్

దీనికి నా పరిష్కారం - సహోద్యోగిని పెళ్లాడటం. 

దీనివల్ల కలిగే లాభాలు : 

క్యాబ్ డబ్బులు తగ్గుతాయి (ప్రయాణ ఖర్చులు)

వర్క్ ఫ్రమ్ హోమ్ కు వర్క్ ఫ్రమ్ ఓమ్ తేడా ఉండదు. రెండూ ఒకేలా ఉంటాయి. 

బోరింగ్ కాల్స్ సమయంలో సరదాగా ఉండవచ్చు.

వర్క్ ప్లేస్ లో అక్రమ సంబంధాలను అస్సలు అవకాశం ఉండదు. 

మీరు సహోద్యోగిని పెళ్ళాడారా?

వర్క్-లైఫ్ ను బ్యాలన్స్ చేయాలంటే ఇలా చేయడం... ఈరోజు హద్దులు చెరిపేయండి  


 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
జీవనశైలి
వైరల్ న్యూస్
భారత దేశం
 
Recommended Stories
Top Stories