MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • వామ్మో.. AI సాయంతో బిడ్డ పుట్టిందా? టెక్నాలజీనా ఇంత అడ్వాన్స్ ఐపోయిందా?

వామ్మో.. AI సాయంతో బిడ్డ పుట్టిందా? టెక్నాలజీనా ఇంత అడ్వాన్స్ ఐపోయిందా?

AI Assisted IVF Baby: కృత్రిమ విధానంలో పిల్లలు పుట్టించే పద్ధతులు ఇప్పుడు మరింత అడ్వాన్స్ అయ్యాయి. ఎందుకంటే వాటికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. AI సాయంతో ప్రపంచంలోనే తొలిసారి శిశువు జన్మించింది. ఇది ఎక్కడ జరిగింది? డాక్టర్లు ఎలాంటి విధానాలు పాటించారు? తదితర ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : Apr 11 2025, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మనిషిగా పుట్టిన తర్వాత చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, మళ్లీ వాళ్ల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్లు.. ఇదే రొటీన్ లైఫ్. ఈ భూమ్మీద మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ చేసే పనే ఇది. ఈ సైకిల్ లో ఏ ఒక్కటి మిస్ అయినా లైఫే పోయినంత ఫీలైపోతుంటారు. చాలా మంది ఉద్యోగాలు రాక బాధపడుతుంటారు. మరికొందరు పెళ్లిళ్లు కావడం లేదని చింతిస్తుంటారు. ఇంకొందరు పెళ్లి అయినా పిల్లలు పుట్టడం లేదని దిగులు చెందుతుంటారు. 
 

25

పూర్వం పిల్లలు పిల్లలు లేకపోతే బంధువుల పిల్లలను దత్తత తీసుకొనే వారు. ఇప్పుడు అలాంటివి లేకుండా పిల్లలు లేని వారి కోసం కృత్రిమ విధానంలో పిల్లలు పుట్టించే అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. సరోగసీ, ఐసీఎస్‌సీ, ఐవీఎఫ్, ఐయూఐ తదితర పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా ప్రస్తుతం IVF విధానం బాగా ప్రచారంలో ఉంది. ఇది అప్డేటెడ్ విధానం కూడా. ఈ పద్ధతిలో ఆడవారి అండాలను బయటకు తీసి, మగవారి వీర్యంతో ప్రయోగశాలలో ఫలదీకరణం చేస్తారు. ఇలా ఏర్పడిన ఎంబ్రియోలను ఆడవారి గర్భాశయంలో ప్రవేశ పెడతారు. దీన్ని టెస్ట్ ట్యూబ్ బేబీ అని కూడా అంటారు. 
 

35

ఇప్పుడు ఈ IVF టెక్నాలజీకి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తోడైంది. దీని ద్వారా అత్యంత పకడ్బందీగా పిండోత్పత్తి చేశారు. ఇలా ప్రపంచంలోనే మొదటి సారి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో IVF విధానంలో శిశువు జన్మించింది. ఈ అరుదైన సంఘటన మెక్సికోలోని హోప్ ఐవీఎఫ్ సెంటర్ లో జరిగింది. 

నిపుణులు సమక్షంలో ఓ 40 ఏళ్ల మహిళ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెడ్ IVF విధానంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. 
 

45

సాధారణంగా అండంలోని స్పెర్మ్ ను ఇంజెక్ట్ చేస్తారు. ఈ విధానాన్ని ఇంట్రాసైటో ప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్(ICSI) అంటారు. ఈ విధానంలో 23 దశలు ఉంటాయి. వాటన్నింటినీ డాక్టర్లు చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తారు. ఈ విధానానికి బదులు ఇక్కడ ఆటోమేటెడ్ IVF సిస్టమ్ ను ఉపయోగించారు. ఇలా చేయడం వల్ల ICSI విధానంలో జరగాల్సిన 23 దశలు డాక్టర్లు, నిపుణుల సాయం అవసరం లేకుండానే ఆటోమేటిక్ గా పూర్తయ్యాయి. 
 

55

ఆటోమేటెడ్ IVF సిస్టమ్ ద్వారా పిండోత్పత్తి ప్రక్రియకు కేవలం 9 నిమిషాల 56 సెకన్లు మాత్రమే సమయం పట్టిందని హోప్ ఐవీఎఫ్ సెంటర్ సిబ్బంది తెలిపారు. మరి ఈ విధానం అన్ని దేశాల్లోనూ అందుబాటులోకి వస్తే పిల్లలు కలగలేదన్న బాధ చాలా మంది తల్లిదండ్రులకు ఉండదు. 
 

ఇది కూడా చదవండి సమ్మర్‌లో కారు టైర్లు పేలిపోకుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
సాంకేతిక వార్తలు చిట్కాలు
గాడ్జెట్‌లు
ఆరోగ్యం
చిన్నారుల సంరక్షణ

Latest Videos
Recommended Stories
Recommended image1
Post Office: కేవలం రూ. 200 కడితే.. రూ. 10 లక్షలు గ్యారెంటీ.. పోస్టాఫీస్ బంపర్ స్కీం..
Recommended image2
House Buy: నెలకు రూ.80 వేల శాలరీతో రూ. 50 లక్షల ఇల్లు కొనడం సాధ్యమేనా.? ఈఎంఐ ఎంత ఉండాలి
Recommended image3
కేవలం రూ. 10 వేలతో 5 ఏళ్లలో లక్షల్లో రాబడి.. SIP ఎలా ప్లాన్ చేసుకోవాలంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved