- Home
- National
- Delhi Rains : డిల్లీలో ధూళి తుఫాను... 15 విమానాలు దారిమళ్లించేంత దారుణ పరిస్థితి, రెడ్ అలర్ట్
Delhi Rains : డిల్లీలో ధూళి తుఫాను... 15 విమానాలు దారిమళ్లించేంత దారుణ పరిస్థితి, రెడ్ అలర్ట్
మండు వేసవిలో వాతావరణం విచిత్రంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా భారీ ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఇలా దేశ రాజధాని డిల్లీలో ఇవాళ వాతావరణం భీభత్సం సృష్టించింది. ఏకంగా 15 విమానాలనే దారి మళ్లించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Delhi Rains
Delhi Rain : దేశ రాజధాని డిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నమంతా ఎండ మండిపోగా సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. ఈదురుగాలులకు తోడు దుమ్ముదూళి గాల్లోకి లేచింది. పనులు ముగించుకుని ఇంటికివెళ్లే సమయంలో గాలిదుమారం మొదలవడంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు.
కేవలం ఈదరుడగాలులే కాదు చాలా ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసాయి. బతమైన గాలుల వల్ల చాలా చెట్లు నేలకొరిగాయి... విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నారు. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రాజధాని నగరంలోని చాలాప్రాంతాలు అందకారంగా మారాయి.
ఆకాశంలో నల్లటి మేఘాలు కమ్ముకుని చీకట్లు కమ్ముకున్నాయి. ఇలా వాతావరణ పరిస్థితి దారుణంగా మారడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి నడిచే 15 విమానాలను దారి మళ్లించారు.. అలాగే చాలా ఫ్లైట్స్ ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇవాళ రాత్రంతా వాతావరణ పరిస్థితి ఇలాగే ఉండే అవకాశాలు ఉండటంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేశారు. రాత్రి 9 గంటలవరకు రెడ్ అలర్ట్ అమల్లో ఉంటుందని ఐఎండి తెలిపారు.
ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో తుఫాను కారణంగా చెట్ల కొమ్మలు విరిగి పడ్డాయి. చాలా చోట్ల చెట్లు కూడా పడిపోయాయి. రోడ్డు మీద చెత్తాచెదారం ఉండటం వల్ల ట్రాఫిక్ ఆగిపోయింది. తుఫాను సమయంలో దుమ్ము, ధూళి ఎగరడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.
Delhi Rains
డిల్లీలో భారీ ఈదురుగాలులు :
డిల్లీతో పాటు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఐఎండి హెచ్చరించింది. ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు. సాయంత్రం నుండి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ఐఎండి సూచించింది. డిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని... కొన్నిచోట్ల గాలవేగం గంటకు 80 కిలోమీటర్లకు చేరే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఈ వర్షాలు, ఈదురుగాలులు, పిడుగుపాట్ల కారణంగా బలహీనమైన నిర్మాణాలకు పాక్షిక నష్టం వాటిలి ఆస్తినష్టం సంభవించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అలాగే ప్రజలు, పశువులకు గాయాలు కావచ్చని... ప్రాణనష్టం జరక్కుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది. అకాల వర్షాల కారణంగా మామిడి తోటలతో పాటు ఇతర పంటలు దెబ్బతినే అవకాశాలున్నాయి,