Mantras: ఏడు రోజులకు ఏడు మంత్రాలు.. ఇవి జపించి పనులు చేస్తే విజయం మీసొంతం
Daily Chant Mantras: జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో రహస్యాలు దాగి ఉంటాయి. మనిషి ఆనందంగా, ఆరోగ్యంగా జీవించడానికి చక్కటి జీవన విధానాన్ని పాటించడానికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో మార్గాలను సూచిస్తుంది. వాటిల్లో ఒకటి మంత్రాలు పఠించడం. ఏ రోజు ఏ మంత్రం జపిస్తే ఆనందం, ఆరోగ్యం కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us
)
పురాణాల ప్రకారం కొన్ని శక్తివంతమైన మంత్రాలు మనుషుల జీవితాల్లో కష్టాలను తొలగించి కోరికలను నెరవేరుస్తాయి. ప్రతి రోజు అలవాటుగా దైవిక మంత్రాలు పఠిస్తే వాటి నుంచి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల పంచభూతాలు సహకరించడం, వ్యక్తిగత సమస్యలు తీరడం, కోరికలు నెరవేరడం జరుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, పండితులు చెబుతున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం వారంలో ఏడు రోజులు.. ఏ రోజు ఏ మంత్రం జపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రతి రోజు జపించాల్సిన మంత్రాలు
సోమవారం.. "ఓం సోమాయ నమః"
సోమవారం అనగా చంద్రుడికి సంబంధించిన రోజు. చంద్రుడు పరమేశ్వరుడి శిఖపై ఆభరణంగా కొలువై ఉన్నాడు. అలాంటి చంద్రుడి మూల మంత్రమైన ‘ఓం సోమాయ నమ:’ మంత్రాన్ని పఠిస్తే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని, భావోద్వేగాలు స్థిరత్వాన్ని పొందుతాయని పండితులు చెబుతున్నారు. మీరు ఎక్కువ ఆందోళన చెందుతుంటే ఈ మంత్రం పఠించడం వల్ల ప్రశాంతత లభిస్తుంది. ఉదయం స్నానం చేసిన తర్వాత కొంత సేపు దేవుని మందిరంలో కూర్చొని ఈ మంత్రం జపించడం మంచిది.
మంగళవారం.. "ఓం అంగారకాయ నమః"
మంగళవారం అంటే అంగారకుడికి ఇష్టమైన రోజు. అందువల్ల మంగళవారం నాడు ‘ఓం అంగారకాయ నమ:’ అనే మూల మంత్రాన్ని జపిస్తే ధైర్యం, బలం, శక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కోపం ఎక్కువగా ఉన్న వాళ్లు, ఆలస్యం పనులు చేసే వారు ఈ మంత్రాన్ని పఠిస్తే సమస్యల నుంచి బయటపడతారు. వీలైతే నవ గ్రహాల వద్ద ఎరుపు రంగు దీపం వెలిగించండి.
బుధవారం.. "ఓం బుధాయ నమః"
ఈ మంత్రం బుధుడికి సంబంధించినది. ఇది జపించడం వల్ల జ్ఞాపకశక్తి, తెలివితేటలు పెరుగుతాయి. ఇది విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కమ్యూనికేషన్ రంగాల్లో ఉద్యోగాలు చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది. మీరు నెగిటివ్ ఆలోచనలతో బాధపడుతున్న వారైతే ‘ఓం బుధాయ నమ:’ మంత్రం జపించడం మంచిది.
గురువారం.. "ఓం గురవే నమః"
గురు గ్రహానికి చెందిన ఈ మంత్రం జ్ఞానం, బోధన, ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తుంది. ‘ఓ గురవే నమ:’ మంత్రం జపించడం వల్ల జీవితంపై స్పష్టత లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై జ్ఞానం పెరుగుతుంది.
శుక్రవారం.. "ఓం శుక్రాయ నమః"
జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. శుక్రుడు శుభాన్ని కలిగించే యోగకారకుడు. అందువల్ల శుక్రుడి మూలమంత్రమైన ‘ఓం శుక్రాయ నమ:’ మంత్రాన్ని ప్రతి శుక్రవారం పఠించడం వల్ల మీ జీవితంలో ప్రేమ, సామరస్యం, సంపద, కళాత్మక లక్ష్యాలు నెరవేరుతాయి. ఈ మంత్రం సంబంధాలు, ఆర్థిక స్థిరత్వాన్ని కూడా కలిగిస్తుంది.
శనివారం.. "ఓం శనేశ్చరాయ నమః"
శనీశ్వరుడు యోగ కారకుడు. జీవితంలో ఎవరైనా ఉన్నతి స్థితికి చేరుకోవాలంటే శని మహాదశ సమయంలోనే జరుగుతుంది. అందువల్ల ప్రతి శనివారం ఉదయం లేదా సాయంత్రం ‘ఓం శనేశ్చరాయ నమ:’ మంత్రాన్ని జపించడం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ మంత్రం కష్టాలు, కర్మ అడ్డంకులను తొలగిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీకు అవకాశం ఉంటే నవగ్రహాల వద్ద ఆవ నూనె దీపాన్ని వెలిగించండి.
ఆదివారం.. "ఓం సూర్యాయ నమః"
ఆదివారం అంటే అందరికీ సెలవు దినమే. కాని వాస్తవానికి ఆదివారమే వారాలన్నింటికీ ప్రారంభ రోజు. ఈ వారాన్ని పాజిటివ్ ఎనర్జీతో ప్రారంభించడానికి ఒక శక్తివంతమైన మంత్రం ‘ఓం సూర్యాయ నమ:’. ఈ మంత్రం జపించడం వల్ల నాయకత్వ అవకాశాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. ఆరోగ్యం కలుగుతుంది.
ఇలా ఏ రోజుకారోజు ఈ ఏడు మంత్రాలను ఉదయం స్వచ్ఛమైన హృదయంతో 11, 27, లేదా 108 సార్లు జపం చేయడం వల్ల అంతా మంచే జరుగుతుంది.