2028 ఒలింపిక్స్‌లో క్రికెట్.. బరిలో మొత్తం ఆరు జట్లు.. భారత్ కు చోటుదక్కుతుందా?
olympics cricket india: లాస్ ఏంజిల్స్ లో జరిగే 2028 ఒలింపిక్స్ లో క్రికెట్ ను టీ20 ఫార్మాట్‌లో కొనసాగించనున్నారు. పురుషులు, మహిళల పోటీలలో ఆరు జట్లు పోటీపడనున్నాయి. తాజాగా ఒలింపిక్ కమిటీ సంబంధిత వివరాలు అధికారికంగా ప్రకటించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
2028 Olympics Cricket: 6 teams announced
olympics cricket: ఒలింపిక్స్ ప్రపంచ దేశాల వేలాది మంది అథ్లెట్లను ఒకచోటకు చేర్చుతుంది. క్రీడల ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. అలాగే, భాష, సంస్కృతి, రాజకీయ వైవిధ్యాలు, విభేదాలను పక్కకుజరిపి ఉమ్మడి క్రీడా స్ఫూర్తితో ప్రపంచ ప్రజలను కలుపుతుంది. ఒలింపిక్స్ ఆతిథ్య నగరానికి పర్యాటకం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉద్యోగ కల్పన వంటి అనేక ఆర్థిక ప్రయోజనాలను కూడా అందిస్తుంది.
అలాంటి ఒలింపిక్స్ గేమ్స్ కు మరోసారి లాస్ ఏంజిల్స్ వేదికకానుంది. 2028 లాస్ ఏంజిల్స్ జరిగే ఒలింపిక్స్ గేమ్స్ లో క్రికెట్ ను కూడా చేర్చారు. అధికారికంగా ఒలింపిక్స్ కమిటీ ఈ వివరాలు పంచుకుంది. దీంతో ప్రపంచ క్రికెట్ దేశాలు ఈ విభాగంలో మెడల్ పై కన్నేశాయి.
ఒలింపిక్స్‌లో క్రికెట్:
ఒలింపిక్స్‌లోకి క్రికెట్ చాలా కాలం తర్వాత తిరిగి వస్తోంది. చివరిసారిగా 1900 పారిస్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ను ఆడారు. ఆ తర్వాత మళ్లీ ప్రతిపాదనలు వచ్చిన ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూడలేకపోయాం. అయితే, ఇప్పుడు లాస్ ఏంజిల్స్‌లో 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను మళ్లీ ప్రవేశపెట్టనున్నారు.
2028 ఒలింపిక్స్‌లో పురుషులు, మహిళల విభాగంలో క్రికెట్ ను చేర్చారు. గతంలో జరిపిన సుదీర్ఘ ఫార్మాట్ పోటీలకు భిన్నంగా ఈ సారి టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ పోటీలు ఉంటాయి. పురుషులు, మహిళల విభాగం నుంచి 6 జట్లు పాల్గొంటాయి, ప్రతి జట్టులో 15 మంది ఆటగాళ్ళు ఉంటారు. ఈ వివరాలను ఒలింపిక్స్ నిర్వాహకులు అధికారికంగా వెల్లడించారు.
1900లో పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో క్రికెట్ చివరిసారిగా కనిపించింది. ఇక్కడ గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ రెండు జట్లు మాత్రమే తలపడ్డాయి. వీటి మధ్య ఒకే ఒక్క మ్యాచ్ జరిగింది. అదికూడా టెస్టు ఫార్మాట్ లో రెండు రోజుల మ్యాచ్ జరిగింది. అయితే, దానికి అధికారిక టెస్టుగా గుర్తింపును ఇవ్వలేదు.
ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC)లో ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఇండియా, ఐర్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వేలు అంటే మొత్తం 12 పూర్తి సభ్య దేశాలు ఉన్నాయి. అలాగే, మరో 94 దేశాలు అసోసియేట్ సభ్య దేశాలు కూడా ఉన్నాయి.
Team India
కానీ, కేవలం ఆరు జట్లకు మాత్రమే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో చోటు దక్కనుంది. దీంతో ఏ దేశాలు పాల్గొంటాయనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే రాబోయే ఒలింపిక్స్ లో క్రికెట్ టోర్నమెంట్‌కు అర్హత ప్రమాణాలు ఇంకా ప్రకటించలేదు. కానీ ఆతిథ్య దేశంగా యూఎస్ఏ ఇందులో చోటుదక్కించుకోనుంది. కాబట్టి ఇంకా ఐదు జట్లు ఏవో తేలాల్సి ఉంది.
ప్రస్తుతం వివిధ దేశాల్లో క్రికెట్ ప్రభావాన్ని, ఐసీసీలో వాటి ప్రాముఖ్యతను గమనిస్తే భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ లకు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ లో చోటుదక్కవచ్చు.
Virat Kohli, RohitSharma
1900 ఒలింపిక్స్‌లో "బ్రిటీష్ ఇండియా"గా భారత్ ఒక అథ్లెట్‌ను పంపింది. అతను అథ్లెటిక్స్‌లో రెండు వెండి పతకాలు సాధించాడు. ఇక ఇటీవల ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళలు, పురుషుల జట్లు మంచి ప్రదర్శన ఇచ్చాయి. కాబట్టి ఒలింపిక్స్‌లో కూడా పతకాలు సాధించే అవకాశం ఉంది. ప్రపంచ క్రీడా సంగ్రామ వేదికపై మరోసారి క్రికెట్ కూడా అందరినీ అలరించడానికి సిద్ధంగా ఉంది.