Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • 'గుడ్ బ్యాడ్ అగ్లీ' రిజల్ట్ ఏంటి ? అజిత్ రియాక్షన్ ఎలా ఉందంటే!

'గుడ్ బ్యాడ్ అగ్లీ' రిజల్ట్ ఏంటి ? అజిత్ రియాక్షన్ ఎలా ఉందంటే!

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందుతుండగా, దీనిపై అజిత్ రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం.

tirumala AN | Published : Apr 11 2025, 11:23 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
14
Asianet Image

'గుడ్ బ్యాడ్ అగ్లీ' రెస్పాన్స్: అజిత్ రియాక్షన్ ఏంటి? మీకు తెలుసా? కోలీవుడ్‌లో ఇప్పుడు హాట్ టాపిక్ అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమానే. ఈ సినిమాను ఆదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేశారు. అజిత్ వీరాభిమాని అయిన ఆయన, దీన్ని ఒక పక్కా ఫ్యాన్ బాయ్ సినిమాగా తీశారు. అజిత్‌ను అణువణువునా ఆస్వాదించే వ్యక్తి మాత్రమే ఇలాంటి సినిమా తీయగలడు అని అభిమానులే ఆశ్చర్యపోయేలా ప్రతి ఫ్రేమ్‌లో అజిత్‌ను అందంగా చూపించారు.

24
గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్

గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్

గుడ్ బ్యాడ్ అగ్లీ రెస్పాన్స్

గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా అభిమానులను ఆకట్టుకున్నా, అది జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందా అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే సినిమాలో కథ అనేది పెద్దగా లేదు. పూర్తిగా అజిత్ మాస్‌ను మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాను ఆదిక్ తీశాడు. అజిత్ అభిమానులకు అది నచ్చినా, జనరల్ ఆడియన్స్‌కు అది ఓవర్ డోస్ అవుతుంది. ఒక సినిమా రిజల్ట్‌ను నిర్ణయించేది దాని బాక్స్ ఆఫీస్ వసూళ్లే. ఆ విధంగా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

 

34
గుడ్ బ్యాడ్ అగ్లీ రెస్పాన్స్

గుడ్ బ్యాడ్ అగ్లీ రెస్పాన్స్

గుడ్ బ్యాడ్ అగ్లీ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్

ఈ సినిమా తమిళనాడు విడుదల హక్కులను కొనుక్కున్న రోమియో పిక్చర్స్ రాహుల్, ఈ సినిమా రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్ చేసిందని చెప్పారు. ఇలా గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాను అభిమానులు నెత్తిన పెట్టుకుంటున్న వేళ, మరోవైపు ఈ సినిమా రిజల్ట్ చూసి అజిత్ రియాక్షన్ ఏంటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం నటుడు అజిత్ స్పెయిన్ దేశంలో కార్ రేస్‌లో బిజీగా ఉన్నారట.

44
గుడ్ బ్యాడ్ అగ్లీకి అజిత్ రియాక్షన్

గుడ్ బ్యాడ్ అగ్లీకి అజిత్ రియాక్షన్

అజిత్ రియాక్షన్ ఏంటి?

ఇలాంటి పరిస్థితుల్లో గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా రిజల్ట్ చూసి అజిత్ ఏమన్నాడని డైరెక్టర్ ఆదిక్ రవిచంద్రన్‌ను అడిగారు. దానికి ఆయన సినిమా రెస్పాన్స్ చూసి అజిత్ సార్ చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు వచ్చిన ఆదరణతో ఫుల్ ఖుషీగా ఉన్న అజిత్, తన తర్వాతి సినిమాను కూడా ఆదిక్ రవిచంద్రన్‌కే ఇవ్వబోతున్నారని సమాచారం.

 

tirumala AN
About the Author
tirumala AN
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది. Read More...
తెలుగు సినిమా
 
Recommended Stories
Top Stories