తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:56 PM (IST) May 30
ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మరో 3 బంగారు పతకాలు సాధించింది. దీంతో మొత్తం 8 బంగారాలు సొంతం చేసుకుంది. 5000 మీటర్లలో గుల్వీర్, హైజంప్‌లో పూజ బంగారం, స్టీపుల్‌చేజ్‌లో పారుల్ జాతీయ రికార్డుతో రజతం గెలిచారు.
11:49 PM (IST) May 30
ఐపీఎల్ 2025 ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ అద్భుత విజయంతో క్వాలిఫయర్-2కు ప్రవేశించింది. గుజరాత్ టైటాన్స్‌తో ఢిల్లీలో జరిగిన కీలక పోరులో ముంబయి జట్టు 20 పరుగుల తేడాతో గెలిచింది. దీంతో గుజరాత్ టోర్నీ నుంచి తప్పుకుంది.
11:05 PM (IST) May 30
ఐఎఫ్ఎఫ్‌సీసో (IFFCO) ఆర్థిక సంవత్సరంలో రికార్డు లాభాలు దక్కాయి. నానో ఫెర్టిలైజర్ అమ్మకాల్లో 47% వృద్ధి సాధించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
10:52 PM (IST) May 30
ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. రోహిత్ శర్మ ఐపీఎల్‌లో 7 వేల పరుగుల మార్క్‌ను అధిగమించిన రెండో ఆటగాడిగా రికార్డు సృష్టించగా..
10:12 PM (IST) May 30
ఐపీఎల్‌లో సంచలనంగా దూసుకొచ్చిన చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశిని ప్రధాని నరేంద్ర మోదీ కలిశారు. శుక్రవారం పట్నా ఎయిర్‌పోర్టులో సూర్యవంశి కుటుంబ సభ్యులతో కలిసి మోదీతో మాట్లాడారు.
09:51 PM (IST) May 30
స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో మరో మైలు రాయిని చేరుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు.
09:46 PM (IST) May 30
ఇంతకాలం హైదరాబాద్ అంటే ఓ మహిళ పేరు అనే మనందరికి తెలుసు. కానీ ఈ పేరు వెనక మరో కథ దాగివుందని తెలుసా? ఆ పేరు వెనకున్న వ్యక్తి ఎవరో తెలుసా?
09:10 PM (IST) May 30
భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్‌లో పాక్ ప్రేరిత ఉగ్రవాద స్థావరాలపై లక్ష్య దాడుల నేపథ్యంలో.. కొలంబియా ప్రభుత్వం పాకిస్తాన్‌లో ప్రాణనష్టంపై సంతాపం తెలిపింది.
08:41 PM (IST) May 30
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కవితం అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. కవిత మాటలు వింటుంటే సొంత అన్నపైనే తిరుగుబాటు మొదలు పెట్టినట్లు స్పష్టమవుతోంది.
08:30 PM (IST) May 30
వెర్రి వెయ్యి విధాలు అని పెద్దలు ఊరికే చెప్పలేదు. స్టార్ హీరోల అభిమానులను చూసినప్పుడు ఇది నిజమే అనిపిస్తుంది. . తమ అభిమానాన్ని చాటుకోవడం కోసం వారు పిచ్చి పిచ్చి పనులు చేస్తుంటారు. తాజాగా మహేష్ బాబు అభిమాని కూడా ఇలాంటి పనే చేశాడు.
08:25 PM (IST) May 30
ఉగ్రవాదులతో పాకిస్థాన్ సంత్సంబంధాలు మరోసారి బైటపడ్డాయి. తాజాగా మరోసారి రాజకీయ నాయకులు ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
07:58 PM (IST) May 30
సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేస్తుంటారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పొదుపు చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే మీరు పెట్టుబడి పెట్టిన మొత్తానికి సెక్యూరిటీతో పాటు మంచి రిటర్న్స్ వచ్చే ఒక మంచి పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
07:54 PM (IST) May 30
కడప మహానాడు సక్సెస్ అయ్యింది. ఈ క్రమంలో మహానాడు నిర్వహణకు సహకరించిన టిడిపి నాయకులకు అభినందనలు, కార్యకర్తలకు హ్యాట్సాఫ్ తెలిపారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.
07:10 PM (IST) May 30
ఒడిశాలోని ఓ ఆలయంలో విరాట్ కోహ్లీలా ఉన్న పూజారి ప్రసాదం ఇస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మైదానంలో ఉండాల్సిన కోహ్లీ ఆలయంలో ఏం చేస్తున్నాడని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.
07:09 PM (IST) May 30
హైదరబాద్ భవితవ్యం మారనుంది. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో అభివృద్ధి లక్ష్యంగా మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం, మెట్రో అధికారులు అడుగులు వేస్తున్నారు.
06:49 PM (IST) May 30
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. శుక్రవారం ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన సభలో ఈ విషయమై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ మోదీ ఏమన్నారంటే.
05:53 PM (IST) May 30
2014 జూన్2వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి 11 ఏళ్లు గుడుస్తోన్న నేపథ్యంలో అసలు తెలంగాణ ప్రాంతానికి ఆ పేరు ఎలా వచ్చింది.? దీని వెనకాల ఉన్న చారిత్ర నేపథ్యం ఏంటి? ఇప్పుడు తెలుసుకుందాం.
04:34 PM (IST) May 30
మనకు తెలిసినంత వరకు రైలు ఎంత వేగంతో వెళ్తుంది. ఏముంది గంటకు వంద లేదా అంతకంటే కాస్త ఎక్కువ అంటారా.? వందే భారత్ అయితే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చు. అయితే గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలు ఉందని మీకు తెలుసా.?
04:25 PM (IST) May 30
ఐపిఎల్ 2025 ఫైనల్స్‌కి చేరాక ఆర్సిబి ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని అంటింది. కప్పు మనదే అంటూ సంబరాలు చేసుకుంటున్న ఫ్యాన్స్ ఇప్పుడో కొత్త డిమాండ్స్ ప్రారంభించారు. అవేంటో తెలుసా?
03:33 PM (IST) May 30
ఐపీఎల్ 2025లో మరో ఆసక్తికర ఘట్టానికి సమయం ఆసన్నమైంది. క్వాలిఫయర్2కి అర్హత సాధించేందుకు గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
03:24 PM (IST) May 30
కేవలం అన్న కేటీఆర్ తోనే కాదు తండ్రి కేసీఆర్ తోనూ కవిత సంబంధాలు దెబ్బతిన్నాయా? అంటే ఆమె మాటలను బట్టిచూస్తే అవుననే సమాధానమే వినిపిస్తోంది.
03:12 PM (IST) May 30
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 ప్లేఆఫ్స్ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరిత దశకు చేరుకున్నాయి. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించి ఫైనల్‌కి చేరగా, ఇప్పుడు అందరి దృష్టి ఎలిమినేటర్ మ్యాచ్‌పై పడింది.
02:56 PM (IST) May 30
టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో బాలకృష్ణ కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ జాతీయ అవార్డు ను ప్రకటించింది. ఈ సందర్భంగా బాలకృష్ణ స్పందించారు.
02:03 PM (IST) May 30
విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. వర్షాల మొదలవడంతో ఎండలు కూడా తగ్గాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు కూడా వరుస సెలవులు వస్తే… హాయిగా కుటుంబంతో ఎంజాయ్ చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ అద్భుత అవకాశం వచ్చింది.
01:52 PM (IST) May 30
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు పెద్ద షాకిచ్చింది. ఇక నుంచి డిగ్రీ విద్యార్థులకు 75 శాతం హాజరు ఉన్నవారికి మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
12:26 PM (IST) May 30
షుగర్ వ్యాధిగ్రస్తులకు అందరితో పాటే తీపి తినాలనిపిస్తుంటుంది. కానీ వారు తీపి తినలేని పరిస్థితి వారికి. అందుకే అలాంటి వారు ఇంట్లో ఈ మూడు రకాల మొక్కలను పెంచుకుంటే వారికి తీపి తినాలనే కోరిక తగ్గుతుంది.
12:16 PM (IST) May 30
ఎప్పటిలా కాదు… ఈసారి ‘ఈ సాలా కమ్ నమ్దే’ అని సగర్వంగా చెప్పుకోడానికి ఆర్సిబి ఫ్యాన్స్ రెడీ అవుతున్నారు. కలల కప్ కి ఆర్సిబి అడుగుదూరంలో నిలిచింది.
11:43 AM (IST) May 30
మరో పదిరోజుల్లో వేసవి సెలవులు ముగుస్తున్నాయి. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక రకాల పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దీంతో తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
11:26 AM (IST) May 30
క్రికెట్ లో ఇప్పటి వరకు దూషణలే కానీ..కొట్టుకోవడానికి చోటు లేదు. కానీ ఇక్కడ ఇద్దరు బ్యాట్స్ మెన్ మాత్రం కొట్టుకునే వరకు వెళ్లింది.సహచరులు వీరిని విడదీశారు. అసలు గొడవకు దిగిన బ్యాట్స్‌మెన్ ఎవరు, ఇది ఎక్కడ జరిగింది అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
09:36 AM (IST) May 30
ప్రతి రోజు నడక చేయడం ద్వారా హై బీపీ నియంత్రించవచ్చని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. 30 నిమిషాల నడక హృదయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
09:12 AM (IST) May 30
ట్రంప్ సుంకాలపై యూఎస్ కోర్టు తాత్కాలికంగా తీర్పు నిలిపివేసింది. జూన్ 9లోగా ప్రభుత్వ స్పందన కోరింది.
08:58 AM (IST) May 30
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటింది. దీనికి తోడు రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో వర్షాలు ఎలా ఉండనున్నాయో వాతావరణ శాఖ ప్రకటించింది.
08:51 AM (IST) May 30
చంద్రబాబు కడప మహానాడులో ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ ప్రకటించి అభివృద్ధి ప్రణాళికలు వెల్లడించారు. టీడీపీ విజయంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.