MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Holidays : తెలుగోళ్లకు వచ్చేవారం సెలవులే సెలవులు .. 9 రోజుల్లో నాల్రోజులే వర్కింగ్ డేస్, ఐద్రోజులు హాలిడేస్

Holidays : తెలుగోళ్లకు వచ్చేవారం సెలవులే సెలవులు .. 9 రోజుల్లో నాల్రోజులే వర్కింగ్ డేస్, ఐద్రోజులు హాలిడేస్

విద్యార్థులకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి. వర్షాల మొదలవడంతో ఎండలు కూడా తగ్గాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగులకు కూడా వరుస సెలవులు వస్తే… హాయిగా కుటుంబంతో ఎంజాయ్ చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే ఉద్యోగులకు ఈ అద్భుత అవకాశం వచ్చింది. 

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 30 2025, 02:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వచ్చేవారం ఉద్యోగులకు సెలవులే సెలవులు
Image Credit : freepik

వచ్చేవారం ఉద్యోగులకు సెలవులే సెలవులు

Holidays in June : సెలవులంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి... విద్యార్థులే కాదు ఉద్యోగులు కూడా హాలిడే అన్న పదం వింటేచాలు ఎగిరి గంతేస్తారు. ఇక లాంగ్ వీకెండ్ వస్తే ఉద్యోగుల ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. కుటుంబంతో లేదంటే స్నేహితులతో సరదాగా బయటకు వెళ్లాలన్నా, రెండుమూడు రోజుల పనేదైనా ఉన్నా... ఈ లాంగ్ వీకెండ్స్ ను వాడుకుంటారు ఉద్యోగులు. అంటే లీవ్ తీసుకోకుండా సెలవులను ఎంజాయ్ చేయవచ్చమాట. అందుకే ఉద్యోగులు సరదాగా లాంగ్ వీకెండ్ ను తమకు దేవుడిచ్చిన వరంగా చెబుతుంటారు.

27
వచ్చేది లాంగ్ వీకెండే...
Image Credit : iSTOCK

వచ్చేది లాంగ్ వీకెండే...

ఇలా లాంగ్ వీకెండ్స్ కోసం ఎదురుచూసే తెలుగు ప్రజలకు గుడ్ న్యూస్. ఈ వారంలో ఒకటి కాదు రెండు లాంగ్ వీకెండ్స్ వస్తున్నాయి. అంటే వచ్చే  తొమ్మిది రోజుల్లో ఏకంగా ఐద్రోజుల సెలవులు వస్తున్నాయి... కేవలం నాలుగురోజులే వర్కింగ్ డే. ఇంకా చెప్పాలంటే ఉద్యోగులు పక్కాగా ప్లాన్ చేసుకున్నారో వచ్చేవారమంతా సెలవులను పొందవచ్చు. ప్రస్తుతం పిల్లలకు వేసవి సెలవులు కొనసాగుతున్నాయి కాబట్టి ఈ వీకెండ్స్ లో హాయిగా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు.

Related Articles

Related image1
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
Related image2
School Holidays : జూన్ సగం వేసవి సెలవులే.. మిగతా రోజుల్లో వచ్చే హాలిడేస్ ఇవే
37
వరుసగా మూడురోజులు సెలవులు
Image Credit : our own

వరుసగా మూడురోజులు సెలవులు

ఇవాళ (శుక్రవారం) ఒక్కరోజే పూర్తిస్థాయి వర్కింగ్ డే... రేపట్నుంచి వీకెండ్ స్టార్ట్. ముఖ్యంగా సాప్ట్ వేర్ తో పాటు వివిధ రంగాల్లో మల్టీ నేషనల్ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు సాధారణంగా శని, ఆదివారం సెలవు ఉంటుంది. కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వారంలో రెండ్రోజుల సెలవు వర్తిస్తుంది. అంటే వీరికి రేపట్నుంచి ఎలాగు రెండ్రోజులు సెలవులే. దీనిని మరో సెలవు అదనంగా వచ్చే అవకాశాలున్నాయి.

47
తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున సెలవు ఉందా?
Image Credit : our own

తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున సెలవు ఉందా?

జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం. ఈ రోజు తెలంగాణలో జాతీయ పతాకాన్ని ఎగరేసి వేడుకలు జరుపుకుంటారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అధికారికంగా సెలవు ఇచ్చే అవకాశాలున్నాయి. ఉద్యోగులు కూడా అవతరణ వేడుకల్లో పాల్గొనే వెసులుబాటు కల్పిస్తూ వేతనంతో కూడిన సెలవును ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు సెలవు ఇస్తే వరుసగా మూడ్రోజులు వస్తాయి... ఈ వీక్ కాస్త లాంగ్ వీకెండ్ గా మారుతుంది.

57
వచ్చేవారం నాల్రోజులే వర్కింగ్ డే
Image Credit : our own

వచ్చేవారం నాల్రోజులే వర్కింగ్ డే

ఇలా ఈ మూడ్రోజుల సెలవుల తర్వాత ఓ నాలుగురోజులు వర్కింగ్ డే. మళ్లీ జూన్ 7న ముస్లింల పవిత్ర పండగ బక్రీద్ ఉంది. ఈ పండగను వారు ఎంతో ఘనంగా జరుపుకుంటారు కాబట్టి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సెలవు ఉంది. తెలంగాణలో కూడా బక్రీద్ పండగరోజు సెలవు ఇచ్చారు. తర్వాతి రోజు అంటే జూన్ 8 ఆదివారమే కాబట్టి సాధారణ సెలవు. ఇలా జూన్ ఫస్ట్ వీక్ లో అందరు ఉద్యోగులకు వరుసగా రెండ్రోజులు సెలవు వస్తోంది.

67
వరుసగా తొమ్మిదిరోజులు సెలవు కావాలంటే..
Image Credit : our own

వరుసగా తొమ్మిదిరోజులు సెలవు కావాలంటే..

మొత్తంగా చూసుకుంటే మే 31 తో ప్రారంభమయ్యే సెలవులు జూన్ 8 వరకు కొనసాగనున్నాయి. మే 31, జూన్ 1,2 తేదీలతో పాటు జూన్ 7, 8 సెలవులు ఉంటాయి. మధ్యలో జూన్ 3,4,5,6 వర్కింగ్ డేస్. ఈ రోజుల్లో కూడా లీవ్ తీసుకుంటే ఉద్యోగులకు వరుసగా తొమ్మిదిరోజులు హాలిడేసే. లీవ్ తీసుకోకున్నా ఐదురోజుల సెలవులు మాత్రం వస్తాయి.

77
పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఇదే మంచి సమయం
Image Credit : our own

పిల్లలతో సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఇదే మంచి సమయం

జూన్ 11తో వేసవి సెలవులు ముగుస్తాయి... జూన్ 12 నుండి పిల్లలకు స్కూళ్లు పున:ప్రారంభం అవుతాయి. కాబట్టి పిల్లలను సరదాగా ఏదయినా ట్రిప్ కు తీసుకెళ్లాలని అనుకునే ఉద్యోగులకు ఇదే మంచి అవకాశం. ప్రస్తుతం ఎండల తీవ్రత తగ్గి తొలకరి జల్లులు కురుస్తున్నాయి... ఇదే సమయంలో సెలవులు కూడా వస్తున్నాయి. ఈ ఆహ్లాదకర వాతావరణంలో సరదాగా ప్రకృతి అందాలతో కూడిన పర్యాటక ప్రాంతాలను వెళ్లివచ్చేలా ప్లాన్ చేసుకొండి. ఇది పిల్లలకు సరదాగా, ఉద్యోగులకు రిఫ్రెష్మెంట్ లా ఉంటుంది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
హైదరాబాద్
తెలంగాణ
భారత జాతీయ క్రికెట్ జట్టు

Latest Videos
Recommended Stories
Recommended image1
Jobs : కేవలం పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు, నేరుగా ఇంటర్వ్యూకు హాజరైతే చాలు
Recommended image2
IMD Rain Alert : అల్పపీడనం ఎఫెక్ట్ తో హెవీ రెయిన్స్ .. ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్, నేడు అల్లోకల్లోలమే
Recommended image3
Jobs: ఎలాంటి ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ లేకుండా ప్ర‌భుత్వ ఉద్యోగం.. నెల‌కు రూ. 17500 జీతం
Related Stories
Recommended image1
Holidays : తెలుగు విద్యార్థులు ఎగిరిగంతేసే సమాచారం.. సమ్మర్ హాలిడేస్ ముగిసాక కూడా మరో 100 రోజుల సెలవులు
Recommended image2
School Holidays : జూన్ సగం వేసవి సెలవులే.. మిగతా రోజుల్లో వచ్చే హాలిడేస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved