ఐఎఫ్ఎఫ్‌సీసో (IFFCO) ఆర్థిక సంవత్సరంలో రికార్డు లాభాలు ద‌క్కాయి. నానో ఫెర్టిలైజర్ అమ్మకాల్లో 47% వృద్ధి సాధించిన‌ట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ప్రపంచంలోనే నెంబర్ వన్ కోఆపరేటివ్ సంస్థగా పేరుగాంచిన IFFCO (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్), 2024–25 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,811 కోట్ల లాభాన్ని (పన్నుల ముందు లాభం) నమోదు చేసింది. ముఖ్యంగా నానో ఎరువుల అమ్మకాల్లో 47% వృద్ధి కనిపించింది. గత ఏడాది 248.95 లక్షల బాటిళ్లను అమ్మిన IFFCO, ఈ ఆర్థిక సంవత్సరంలో 365.09 లక్షల నానో ఎరువుల బాటిళ్లు విక్రయించింది. మొత్తం టర్నోవర్ రూ. 41,244 కోట్లుగా న‌మోదైంది.

IFFCO ఛైర్మన్ దిలీప్ సంగానీ మాట్లాడుతూ.. ఇది భారత కోఆపరేటివ్ రంగానికి గర్వకారణమని అన్నారు. గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో కూడా సంస్థ రూ. 3000 కోట్లకుపైగా లాభాలు పొందిందని తెలిపారు. సంస్థ 23 ఏళ్లుగా షేర్ కాపిటల్‌పై 20% డివిడెండ్ ఇచ్చి సభ్యులకు నిబద్ధతను చూపుతోంది.

IFFCO ప్రధానంగా నానో యూరియా ప్లస్ (Liquid), నానో DAP (Liquid) అమ్మకాలపై దృష్టి సారించింది.

నానో యూరియా ప్లస్: 268 లక్షల బాటిళ్లు (గత ఏడాది కంటే 31% వృద్ధి)

నానో DAP: 97 లక్షల బాటిళ్లు (118% వృద్ధి)

ఈ అమ్మకాల విలువ:

12 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ యూరియాకు సమానం

4.85 లక్షల మెట్రిక్ టన్నుల సాధారణ DAPకు సమానం

ఇతర విజయాలు:

IFFCO WSF/ స్పెషాలిటీ ఎరువులు/ సాగరికా గ్రాన్యూల్స్ అమ్మకాలు 1.92 లక్షల మెట్రిక్ టన్నులు

సాగరికా లిక్విడ్: 11.55 లక్షల లీటర్లు (33% వృద్ధి)

బయో ఎరువులు: 8.61 లక్షల లీటర్లు (35% వృద్ధి)

నూతన ప్రాజెక్టులు:

IFFCO త్వరలో నానో NPK గ్రాన్యూల్స్ ప్రారంభించనుంది. ఇందులో మెగ్నీషియం, సల్ఫర్, జింక్, కాపర్ ఉంటాయి. ఇది నేలలో పోషక లోపాలు తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. నానో జింక్, నానో కాపర్ లిక్విడ్ బాటిళ్లు (100ml) విడుదల కానున్నాయి.

1 జూలై 2024న ప్రారంభించిన "నానో విలేజ్ క్లస్టర్స్ ప్రాజెక్ట్" ద్వారా దేశవ్యాప్తంగా 203 గ్రామాల్లో నానో ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించారు. 5 లక్షల ఎకరాల్లో ప్రాజెక్ట్ చేప‌ట్టారు. 28.73% రసాయన ఎరువుల వినియోగం తగ్గింది

5.8% దిగుబడి పెరిగింది. 72,000 ఎకరాల్లో డ్రోన్ స్ప్రే చేశారు. IFFCO 1,470 ట్రయల్స్‌ని దేశవ్యాప్తంగా 15 వాతావరణ మండలాల్లో నిర్వహించింది. ఈ ప్రయోగాల్లో నానో DAP వల్ల దిగుబడి 5.27%, నానో యూరియా వల్ల 5.28% పెరిగింది.

అంతర్జాతీయ గుర్తింపు:

IFFCO ఇప్పటివరకు 40 దేశాల్లో నానో ఎరువులు ప్రవేశపెట్టింది. అమెరికా, బ్రెజిల్, కెన్యా వంటి దేశాలు నానో టెక్నాలజీ పట్ల ఆసక్తి చూపించాయి. IFFCO‌కు ప్రపంచవ్యాప్తంగా 10 తయారీ యూనిట్లు, దేశవ్యాప్తంగా 5 కోట్లమందికి పైగా రైతులకు సేవలందిస్తోంది. IFFCO MD డాక్టర్ యు.ఎస్. అవస్థి ICA 2024లో ‘రోచ్డేల్ పయనీర్స్ అవార్డు’, ‘ఫర్టిలైజర్ మాన్ ఆఫ్ ఇండియా’ అవార్డులు పొందారు.

పురస్కారాలు:

IFFCO సహకారితా రత్న అవార్డు: మాన్సింభాయ్ పటేల్ (గుజరాత్), IFFCO సహకారితా బంధు అవార్డు: అమ్రిక్ సింగ్ (హర్యానా).