తెలుగు లైవ్ న్యూస్ అప్డేట్స్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తో పాటు జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు,, లైఫ్ స్టైల్, బిజినెస్ ప్రధాన అంశాలతో పాటు ఈరోజు జరిగే లేటెస్ట్ లైవ్ న్యూస్ అప్డేట్స్ అన్ని ఒకే చోట ఎప్పటికప్పుడు ఇక్కడ చూడండి..

11:43 PM (IST) Jun 04
Hyderabad: హైదరాబాద్‌లో కొల్లూర్ సమీపంలో 70 అంతస్తుల టవర్ నిర్మాణంలో ఉండగా, త్వరలో 100 అంతస్తుల మరో టవర్‌కు అనుమతులు ప్రాసెస్‌లో ఉన్నాయి. నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ మరింత పెరుగుతోందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
11:30 PM (IST) Jun 04
Clay pot: వేసవిలో మట్టి కుండలో నీళ్లు తాగితే చల్లగా ఉండటమే కాకుండా, ఆరోగ్యానికి కూడా మంచిది. అయితే ఎక్కువ కాలం నీళ్లు కుండలో ఉండిపోతే పాడైపోతుంది. కుండను నేచురల్ గా ఎలా శుభ్రం చేయాలో టిప్స్ తెలుసుకుందాం రండి.
11:14 PM (IST) Jun 04
కార్తీక దీపం సీరియల్ విలన్, బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రకటించింది. ఇంతకీ ఆమె ఎందుకుఈ నిర్ణయం తీసుకుందో తెలుసా?
11:00 PM (IST) Jun 04
Vida Z: హీరో కంపెనీ విడా Z అనే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని మార్కెట్లోకి తీసుకొస్తుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే.. బ్యాటరీ తీసి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇలాంటి బెస్ట్ ఫీచర్లు ఏమున్నాయో తెలుసుకుందాం రండి.
10:37 PM (IST) Jun 04
Gold Jewelry: బంగారు నగలు ఇష్టమడని మగువలు ఉంటారా? కాస్త డబ్బులెక్కువైనా గోల్డ్ ఆర్నమెంట్స్ కొనడానికే ఇష్టపడతారు. అయితే తయారీ ఛార్జీలు, వేస్టేజ్ లేకుండా బంగారు నగలు ఎలా కొనాలో ఇప్పుడు తెలుసుకుందాం.
10:12 PM (IST) Jun 04
మన దేశంలో ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఎక్కువగా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
09:43 PM (IST) Jun 04
Bengaluru Stampede: ఐపీఎల్ 2025 ట్రోఫీ గెలిచిన RCB జట్టు విజయోత్సవాల్లో చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 11 మంది చనిపోయారు, చాలా మంది గాయపడ్డారు. మృతుల పేర్లు, వివరాలను అధికారులు వెల్లడించారు.
08:57 PM (IST) Jun 04
Bengaluru stampede: ఐపీఎల్ 2025లో ఆర్‌సీబీ గెలుపు వేడుక క్రమంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరగింది. 11 మంది చనిపోయారు. బాధిత కుటుంబాలకు సీఎం సిద్ధరామయ్య రూ.10 లక్షల సాయం ప్రకటించారు.
08:30 PM (IST) Jun 04
Bengaluru Stampede: ఆర్సీబీ విజయోత్సవం మధ్యలో బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై ప్రధాని మోడీ సహా ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
08:04 PM (IST) Jun 04
RCB Stampede: బెంగళూరులో ఆర్‌సీబీ విజయ సంబరాల్లో చిన్నస్వామి స్టేడియం వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలోనే అక్కడి ప్రాంతాల్లో భారీ రద్దీ కారణంగా మెట్రో స్టేషన్లను మూసివేశారు.
07:20 PM (IST) Jun 04
AI వల్ల కొన్ని ఉద్యోగాలు పోవచ్చు కానీ.. సక్రమంగా వినియోగించే వారికి AI శక్తివంతమైన సాధనంగా మారుతుందని గూగుల్ డీప్‌మైండ్ CEO, నోబెల్ విజేత డెమిస్ హస్సబిస్ అన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యువతకు ఆయన ఇచ్చిన సూచనలు తెలుసుకుందాం రండి.
07:09 PM (IST) Jun 04
Stampede: ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు నిలిచింది. అయితే, బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాటతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
06:55 PM (IST) Jun 04
అభిమానుల 18 ఏళ్ల కలను నిజం చేస్తూ ఆర్సీబీ జట్టు ఐపీఎల్ 2025ని కైవసం చేసుకుంది. అయితే ఎంతో సంతోషంగా ముగియాల్సిన ఈ క్షణం కాస్త విషాదంగా మారింది. విక్టరీ పరేడ్‌లో అసలు తొక్కిసలాట ఎందుకు జరిగింది? కారణం ఏంటంటే..
06:31 PM (IST) Jun 04
Stampede: ఐపీఎల్ 2025లో RCB విజయాన్ని పురస్కరించుకుని బెంగళూరులో జరిగిన వేడుకల్లో తొక్కిసలాట జరిగింది. తీవ్ర విషాదం నింపిన ఈ ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
05:53 PM (IST) Jun 04
Nokia Lumia 500: ప్రపంచ సెల్ ఫోన్ దిగ్గజ కంపెనీ నోకియా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌కి తిరిగి ప్రవేశించింది. ఈ సారి లూమియా 500 5G పేరుతో అత్యాధునిక ఫోన్‌ను విడుదల చేసింది. ఈ సూపర్ ఫోన్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందామా?
05:42 PM (IST) Jun 04
అమరావతి నిర్మాణం దిశగా కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇప్పటికే అమరావతి పుననిర్మాణ పనులు ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
05:41 PM (IST) Jun 04
RCB victory parade: పంజాబ్ కింగ్స్ ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ 2025 ఛాంపియన్ గా నిలిచింది. అయితే, బెంగళూరులో ఆర్సీబీ గెలుపు సంబరాల్లో తొక్కిసలాట జరిగింది.
05:07 PM (IST) Jun 04
కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లు పరిస్థితి మారింది. కాసుల కక్కుర్తి కోసం కొందరు ఎంతకైనా దిగజారుగుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఓ సంఘటన షాక్‌కి గురి చేస్తోంది.
04:43 PM (IST) Jun 04
భారత ప్రభుత్వం త్వరలోనే కొత్త ఈ వేస్ట్ పాలసీని తీసుకొచ్చేందుకు అడుగులు వేస్తోంది. ఈ నిర్ణయంపై పలు ఎలక్ట్రానిన్ సంస్థలు న్యాయ పోరాటానికి దిగాయి. ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకొస్తే వస్తువుల ధరలు భారీగా పెంచాల్సి వస్తాయని చెబుతున్నాయి.
04:30 PM (IST) Jun 04
RCB IPL 2025 Victory Parade:18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ RCB ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా విధాన సౌధలో కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా జట్టును సత్కరించనుంది.
03:57 PM (IST) Jun 04
RCB victory parade: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. గెలుపు తర్వాత ఆర్సీబీ బెంగళూరు నగరానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున గెలుపు సంబరాలకు ప్లాన్ చేశారు.
03:55 PM (IST) Jun 04
జమ్మూ కశ్మీర్‌లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అధికారికంగా వెల్లడించారు.
03:25 PM (IST) Jun 04
ఎమ్మెల్సీ కవిత దూకుడు పెంచారు. మొన్నటి వరకు సొంత పార్టీ నాయకులపై విమర్శలు చేస్తూ వచ్చిన కవిత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కేసీఆర్‌కు నోటీజులు జారీ చేయడంపై బుధవారం ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు.
02:12 PM (IST) Jun 04
ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతికి కేరాఫ్‌గా నిలిచే ఒంగోలు బ్యాక్ వాటర్స్ వద్ద 'EBG గ్రూప్' రూపొందించిన చతుర్వాటిక అనే వెల్‌నెస్ టౌన్‌షిప్ నిర్మాణం అందరినీ ఆకట్టుకుంటోంది.
12:57 PM (IST) Jun 04
ఆంధ్రప్రదేశ్ విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ ట్రాన్స్కో (AP Transco) రాష్ట్రంలో నిరాటంకంగా విద్యుత్ అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇందకోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నారు.
12:51 PM (IST) Jun 04
Tata Harrier EV: టాటా మోటార్స్ భారత్‌లో కొత్త హారియర్ EV మోడల్‌ను విడుదల చేసింది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 625 కి.మీ. ప్రయాణిస్తుంది. హైఎండ్ ఫీచర్స్ తో ఇంత ఎక్కువ మైలేజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. ఈ కారు ధర, ఫీచర్స్ తెలుసుకుందామా?
11:46 AM (IST) Jun 04
Gold Price: గోల్డ్ ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రూ.లక్షకు దగ్గర్లో ఉంది. అంతా బాగుంటే ఉంటే రెండు, మూడు రోజుల్లో రూ.లక్ష దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఏ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.
11:39 AM (IST) Jun 04
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రఖ్యత యూనివర్సిటీ మాసచూసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మేఘా వేమూరికి గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి హాజరుకావడానికి అనుమతించలేదు. వర్సిటీ ఆ నిర్ణయం ఎందుకు తీసుకుంది.? ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
11:06 AM (IST) Jun 04
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటితో సరిగ్గా ఏడాది గడించింది. ఈ నేపథ్యంలో ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాల గురించి తెలుసుకుందాం.
09:01 AM (IST) Jun 04
08:23 AM (IST) Jun 04
18 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది…. ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఐపిఎల్ కప్ ను ముద్దాడాడు. ఆర్సిబి విన్నింగ్ మూమెంట్స్ లో కోహ్లీ, అనుష్క దంపతులు చాలా ఎమోషనల్ అయ్యారు… కోహ్లీ అయితే మైదానంలోనే ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు.