Gold Price: గోల్డ్ ధర మళ్లీ పరుగులు పెడుతోంది. ప్రస్తుతం రూ.లక్షకు దగ్గర్లో ఉంది. అంతా బాగుంటే ఉంటే రెండు, మూడు రోజుల్లో రూ.లక్ష దాటేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏఏ నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి.

ప్రపంచంలో ఇతర దేశాలతో పోలిస్తే బంగారం వినియోగం ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది. జనాభా ఎక్కువ, రకరకాల మతాలు, సంప్రదాయాలు, పండగలు ఇలా కారణం ఏదైనా బంగారం వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎలాంటి పండగలు లేకపోయినా బంగారం ధర పెరుగుతూ ఉండటం విశేషం. దీనికి స్వదేశ కారణాల కంటే ప్రపంచ దేశాల పరిస్థితుల ప్రభావం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

బంగారం ధరలు పెరగడానికి అనేక కారణాలు

ట్రంప్ టారిఫ్ లు, చైనా ప్రతి చర్యలు, రష్యా హెచ్చరికలు, ఇజ్రాయిల్ దేశ పరిస్థితులు ఇలా అనేక అంశాలు గోల్డ్ ధరలు పెరగడానికి కారణాలు.

సుమారు నెల రోజుల క్రితం బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అప్పటికే రూ.లక్షకు చేరువలో ఉన్న బంగారం ధర ఒక్కసారిగా తగ్గడంతో ఇక కంటిన్యూగా తగ్గడం జరుగుతుందని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంలో వ్యాపార రంగంలో అనేక విభాగాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో పెట్టుబడి దారులు రిస్క్ తక్కువగా ఉన్న గోల్డ్ పై పెట్టుబడులు పెట్టడం తిరిగి ప్రారంభించారు. దీంతో తగ్గుతున్న బంగారం ధర కాస్తా మళ్లీ పెరగడం ప్రారంభమైంది.

గతంలో రూ.99 వేలు దాటిన బంగారం ధర

గత నెల రోజులుగా కొంచెం కొంచెంగా పెరుగుతూ వస్తున్న గోల్డ్ రేట్ ప్రస్తుతం రూ.99 వేలు దాటింది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు, మూడు రోజుల్లో రూ.లక్ష దాటే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రధాన నగరాల్లో బంగారం ధర రూ.99,060

దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగలూరు, జైపూర్, లక్నో, హైదరాబాద్, అహ్మదాబాద్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.99,060గా నమోదైంది.

తెలుగు రాష్ట్రాల్లో ముఖ్య నగరాల్లో ధరలు ఇలా..

హైదరాబాద్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,060 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,800 పలికింది. ఇక వెండి విషయానికొస్తే ఒక కేజీ వెండి ధర రూ. 1,00,200 గా నమోదైంది.

విజయవాడ, విశాఖపట్నం ఈ రెండు నగరాల్లో ధరలు సమానంగా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం రూ.9,917 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.9,090 గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,438గా రికార్డ్ అయ్యింది.

తిరుపతిలో 24 క్యారెట్ల బంగారం రూ.9,777 కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.8,962 గా ఉంది. ఇక 18 క్యారెట్ల బంగారం ధర రూ.7,332గా రికార్డ్ అయ్యింది.