సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పిన శోభా శెట్టి, కారణం ఏంటో తెలుసా?
కార్తీక దీపం సీరియల్ విలన్, బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రకటించింది. ఇంతకీ ఆమె ఎందుకుఈ నిర్ణయం తీసుకుందో తెలుసా?

కార్తీక దీపం సీరియల్ ద్వారా తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా దగ్గరయ్యింది కన్నడ నటి శోభా శెట్టి. తెలుగు బుల్లితెర శోభా శెట్టి చేసే సందడి అంతా ఇంతా కాదు. చాలామంది తెలుగు ఆడపడుచుల ఫేవరెట్ సీరియల్ అయిన కార్తీక దీపంలో విలన్ మోనితగా శోభా శెట్టి నటనకు అంతా ఫిదా అయ్యారు. ఇక ఈ క్రేజ్ తో ఆమె తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఛాన్స్ కొట్టేసింది. బిగ్ బాస్ లో చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్ హౌస్ లో ఉన్నవారిని ఒక ఆట ఆడేసుకుంది శోభ. శివాజీ బ్యాచ్ ను కూడా భయపెడుతూ.. ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఫైనల్ వరకు వెళ్లకపోయినా టాప్ 10 లో మాత్రం స్థానం సంపాధించుకుంది శోభా శెట్టి. ఇక తెలుగు బిగ్ బాస్ తరువాత కన్నడ బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టి అక్కడ కూడా రచ్చ రచ్చ చేసింది శోభా శెట్టి. కన్నడ బిగ్ బాస్ లో ఎక్కువరోజులు ఉండలేక హోస్ట్ కిచ్చా సుదీప్ ను రిక్వెస్ట్ చేసి మరీ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. అంతే కాదు కార్తీక దీపం సీరియల్ లో కార్తీక్ తమ్ముడి పాత్ర చేసిన యశ్వంత్ తో ప్రేమలో పడి... లాస్ట్ ఇయర్ ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది శోభా శెట్టి.
అయితే రీసెంట్ గా ఆమె ఏ సీరియల్ లో నటించినట్టు కనిపించలేదు. అప్పుడప్పువు టీవీ షోస్ మాత్రమే చేస్తోంది. అంతే కాదు సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టీవ్ గా ఉండేది శోభా శెట్టి. సడెన్ గా ఆమె తీసుకున్న నిర్ణయం అందరికి షాక్ ఇచ్చింది. ‘కొద్ది రోజులు సోషల్ మీడియాకి దూరం కాబోతున్నాను’ అంటూ ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టి అభిమానులను ఆశ్చర్యపరిచింది. అయితే శోభా శెట్టి ఇలా సడెన్ గా ఎందుకు చేసింది అనేది అందరికి షాకింగ్ గా ఉంది.
శోభా శెట్టి సోషల్ మీడియాకు దూరం కావడానికి కారణాలు ఏంటీ అని అంతా ఆరా తీస్తున్నారు. అయితే ఆమె తన వ్యక్తిగత సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తరువాత శోభా శెట్టికి అవకాశాలు తగ్గిపోయాయి. కార్తీక దీపం సీజన్ 2 నడుస్తుంది కాని అందులో ఆమె పాత్ర మిస్ అయ్యింది.
అలాగే నిశ్చాతార్థం జరిగి ఏడాది గడిచింది. కానీ పెళ్లి మాట మాత్రం ఎత్తలేదు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ గార్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లు తెలుసింది. అది కూడా సాఫీగా జరగడం లేదని టాక్.
ఇలా తాను అనుకున్నవీ ఏవీ జరగకపోవడంతో శోభ డిప్రెషన్ లోకి వెళ్లిందని ప్రచారం జరుగుతోంది. అందుకే కాస్త గ్యాప్ తీసుకోవడానికి సోషల్ మీడియాకి కూడా దూరమైనట్లు తెలుస్తోంది.ఇందులో నిజం ఎంతో తెలియదు కాని.. బయట ప్రచారం మాత్రం ఇదే జరుగుతోంది.