RCB victory parade: ఐపీఎల్ 2025 ఫైనల్ లో పంజాబ్ కింగ్స్ పై గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఛాంపియన్ గా నిలిచింది. గెలుపు తర్వాత ఆర్సీబీ బెంగళూరు నగరానికి చేరుకోవడంతో పెద్ద ఎత్తున గెలుపు సంబరాలకు ప్లాన్ చేశారు.

RCB victory parade: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 లో అద్భుత‌మైన ఆట‌తీరుతో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విక్ట‌రీ కొట్టింది. 18 ఏళ్ల త‌ర్వాత తొలి సారి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. దీంతో బెంగ‌ళూరు పెద్ద ఎత్తున సంబ‌రాలకు సిద్ధ‌మైంది. అయితే, ఆర్సీబీ విక్టరీ పరేడ్ సంబరాలకు బ్రేక్ పడింది.

ఐపీఎల్ ట్రోఫీని తొలిసారి గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు విజయోత్సవ పరేడ్‌కు అనుమతి లభించలేదు. జూన్ 3న పంజాబ్ కింగ్స్‌ను ఆరు పరుగుల తేడాతో ఓడించి చరిత్ర సృష్టించిన ఆర్సీబీ, ఆ విజయాన్ని ఓ ఓపెన్ బస్ పరేడ్ ద్వారా ప్రజలతో పంచుకోవాలని భావించింది. కానీ బెంగళూరు పోలీసులు ఇందుకు అనుమతి ఇవ్వకపోవడంతో పరేడ్ రద్దయిందని సమాచారం.

Scroll to load tweet…

ఆర్సీబీ ముందుగా రూపొందించిన ప్రణాళిక ప్రకారం, జట్టు మద్యాహ్నం 1:30 గంటలకు బెంగళూరుకు చేరి, సాయంత్రం 3:30కి విధాన సౌధ నుండి ఓపెన్ బస్ పరేడ్ ప్రారంభించి 5 గంటల సమయంలో చిన్నస్వామి స్టేడియంకు చేరుకోవాల్సి ఉంది.

అక్కడ పెద్ద ఎత్తున అభిమానులతో కలిసి విజయోత్సవ వేడుకలు జరపాలని ప్లాన్ చేశారు. కానీ నగర ట్రాఫిక్, భద్రతా పరమైన కారణాలతో పోలీసులు అనుమతిని తిరస్కరించారు.

దీంతో పరేడ్‌కు బదులుగా జట్టును చిన్నస్వామి స్టేడియంలో సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకూ గెలుపు సంబరాలుల, సన్మానాలు నిర్వహించనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా ప్రవేశం టిక్కెట్లు లేదా పాస్‌లతోనే పరిమితం చేసినట్టు సమాచారం.

స్టేడియం వద్ద పార్కింగ్ సౌకర్యాలు లిమిటెడ్‌గా ఉండటంతో ప్రజలు మెట్రో లేదా ఇతర బహిరంగ రవాణా సదుపాయాలను వినియోగించాల్సిందిగా సూచించారు. అలాగే, సాయంత్రం 3 గంటల నుండి 8 గంటల వరకూ సిటీ సెంటర్ (CBD) ప్రాంత సందర్శనకు దూరంగా ఉండాలని సూచనలు జారీ చేశారు.

Scroll to load tweet…

ఇక ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే జూన్ 3న జరిగిన ఫైనల్లో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్‌పై ఆరు పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇతర బ్యాట్స్‌మెన్ కూడా కంట్రిబ్యూషన్ ఇచ్చి స్కోరు బోర్డుపై 190 పరుగులు నమోదు చేశారు.

తర్వాత బౌలింగ్‌లో పాండ్యా అద్భుతమైన బౌలింగ్ తో నాలుగు ఓవర్లలో కేవలం 17 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు. మ్యాచ్ ఆర్సీబీ వైపు రావడంతో కీలకంగా ఉన్నాడు. అతని అద్భుత ప్రదర్శనకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇతర బౌలర్లు కూడా కీలక వికెట్లు తీసి జట్టును విజయంలో నిలిపారు.

ఈ విజయంతో 18 ఏళ్ల ఎదురుచూపులకు ముగింపు పలికి ఆర్సీబీ ట్రోఫీని ఎట్టకేలకు ఎత్తింది. అయితే, విజయోత్సవాల్లో ప్రజలతో కలిసి భాగం కావాల్సిన పరేడ్‌కు అనుమతి రాకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగించింది. మ్యాచ్ గెలిచిన వెంటనే బెంగళూరు రోడ్లపైకి పెద్ద ఎత్తున అభిమానులు చేరి సంబరాలు చేసుకున్నారు. అయితే, ట్రాఫిక్ కు అంతరాయం కలగడంతో పోలీసులు జోక్యం చేసుకున్నారు.